ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: పెంగ్విన్‌లు ఇలాక్కూడా చేస్తాయా? తన దారికి అడ్డుగా మనుషులుంటే..

ABN, Publish Date - Dec 23 , 2024 | 10:20 AM

తన దారిలో అడ్డుగా నిలబడ్డ మనుషులు తప్పుకునే వరకూ ఓ పెంగ్విన్ ఓపిగ్గా ఎదురుచూసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మనదారిలో ఎవరైనా అడ్డుగా నిలబడ్డారంటే క్షణాల్లో విసుగొచ్చేస్తుంది. రుసరుసలు మొదలవుతాయి. ఎంతటి సంస్కారవంతులైన ఒక్కోసారి ఇలాంటి సందర్భాల్లో మాట తూలుతారు. అయితే, సహజంగా దూకుడు ఎక్కువగా ఉండే జంతువులు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో సున్నితంగా వ్యవహరిస్తే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. అందుకే, ప్రస్తుతం ఓ పెంగ్విన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పెంగ్విన్ చేసిన పని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..

Jeff Bezos Wedding: నా పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చా.. పచ్చి అబద్ధం: జెఫ్ బెజోస్


ఇటీవల ఓ జంట అంటార్కిటికాలో పర్యటించింది. అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయిన ఆ జంట పెంగ్విల్‌లో వెళ్లే రోడ్డులో అడ్డంగా నిలబడింది. చూట్టూ చూస్తూ మైమరిచిపోయింది. తమ వెనక అదే రోడ్డులో వస్తున్న పెంగ్విన్‌ను వారు అస్సలు గమనించనేలేదు. ఈలోపు పెంగ్విన్ వారిని సమీపించింది. చివరకు వారు కదిలేవరకూ అక్కడే ఉండిపోయింది. వారిపై అరవడం గానీ, మరో మార్గంలో వెళ్లడం గానీ చేయలేదు. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ వ్యక్తి పెంగ్విన్ అవస్థను గమనించి ఆ జంటను అప్రమత్తం చేశారు. దీంతో, వారు పెంగ్విన్ చూసి మురిసిపోయి దాని దారికి అడ్డుతొలగారు. వారు పక్కకు తప్పుకోగానే పెంగ్విన్ యథాప్రకారం నడుచుకుంటూ వెళ్లిపోయింది.

Viral: భారత్‌ను వీడండి! ఇదే తగిన సమయం: స్టార్టప్ సంస్థ వ్యవస్థాపకుడి షాకింగ్ కామెంట్


తన దారికి ఆ జంట అడ్డుగా ఉన్నా కూడా పెంగ్విన్ వారిని ఏమీ అనకపోవడం, కనీసం ఎటువంటి చప్పుడు కూడా చేయకపోవడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఈ పెంగ్విన్ తెలిసినంత మర్యాద మరెవ్వరికీ తెలీదని కొందరు కామెంట్ చేశారు. దీనికి మొహమాటం ఎక్కువని మరికొందరు అన్నారు. వారు తప్పుకునే వరకూ ఓపిగ్గా పెంగ్విన్ ఎదురు చూడటం ముచ్చటగొలిపేలా ఉందని అన్నారు. ఇక కొందరు సెటైర్లు కూడా పేల్చారు. మొహమాటం కారణంగా నేను ట్రాఫిక్‌లో ఇలాగే చిక్కుకుపోతుంటా అని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు.

కాగా, పెంగ్విన్ తీరుపై జంతుశాస్త్రవేత్తలు కూడా కీలక వివరణ ఇచ్చారు. సాధారణంగా పెంగ్విన్‌లు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడవని, సురక్షితమైన మార్గాలు ఏర్పాటు చేసుకుని ఆ దారి మీదుగానే వెళుతుంటాయని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మనుషులు నడయాడిన మార్గాలనూ తమవిగా చేసుకుని ప్రయాణిస్తుంటాయని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య పెంగ్విన్ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు

Read Latest and Viral News

Updated Date - Dec 23 , 2024 | 10:31 AM