ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇది కదా అసలైన హోమ్ డెలివరీ అంటే.. వీళ్లు చేస్తున్న పని చూస్తే.. అవాక్కవడం ఖాయం..

ABN, Publish Date - Aug 11 , 2024 | 01:41 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలను చూసినప్పుడు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూసినప్పుడు అనితర సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. కాస్త వినూత్నంగా ఉన్న ఘటనలకు సంబంధించిన వీడియోలు...

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలను చూసినప్పుడు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూసినప్పుడు అనితర సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. కాస్త వినూత్నంగా ఉన్న ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది కదా అసలైన హోమ్ డెలివరీ అంటే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హోమ్ డెలివరీ (Home delivery) అనగానే ఎవరైనా.. ఏదైనా వస్తువును ఇంటికి డెలివరీ చేయడం.. అని అనుకుంటారు. అలా కాకుండా ఏకంగా హోమ్‌నే డెలివరీ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం.

Viral Video: బాబోయ్.. ఒట్టి చేతులతో సమోసాలు వేయించి.. చివరకు మరుగుతున్న నూనెతో ఏం చేశాడో చూస్తే..


చాలా మంది జనం ఓ ఇంటిని పూర్తిగా పెకలించి, చుట్టూ చేరి భుజాలపై మోసుకెళ్తున్నారు. ఇల్లు మొత్తం చెక్కుచెదరకుండా జాగ్రత్తగా నేల కింద మట్టిని తొలగించారు. ఫైనల్‌గా ఆ ఇంటి కింద చుట్టూ పెద్ద ఇనుప రాడ్లను ఏర్పాటు చేశారు. చివరగా ఆ ఇంటి చుట్టూ చాలా మంది చేరుకుని ఇనుప రాడ్లను (people carrying the house on their shoulders) భుజాలపై పెట్టుకుని ఆ ఇంటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: సబ్‌మెరైన్‌లా మారిన ట్రాక్టర్.. నీటిలోకి వెళ్లగానే షాకింగ్ సీన్.. చివరకు చూస్తే..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.., ‘‘మాక్కూడా ఇలాగే ఓ ఇంటిని తీసుకురండి’’.., ‘‘హోమ్ డెలివరీకి నిజమైన అర్థం ఇదే’’.., ‘‘అరే.. ఇది ఎలా సాధ్యమైంది’’.., ‘‘ఇది చాలా మంచి ఆలోచన’’.., ‘‘ఢిల్లీకి సమీపంలో ఇలాంటి పని చేస్తుంటారు. అయితే కొన్ని అడుగులు మాత్రమే మారుస్తుంటారు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..

Updated Date - Aug 11 , 2024 | 01:41 PM

Advertising
Advertising
<