Banana: నందిగామలో ఆశ్చర్యపరుస్తున్న అరటి గెల
ABN, Publish Date - Jan 19 , 2024 | 06:10 PM
జిల్లాలోని నందిగామలో అరటి గెల అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. నందిగామకు చెందిన విశ్రాంత విద్యాశాఖ అధికారి కేజెడ్ఎస్ కుమార్ ఇంటి ఆవరణలోని అరటి చెట్టుకు 9అడుగుల పొడవైన అరటిగెల కాసింది. ఈ విషయం..
ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని నందిగామలో అరటి గెల అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. నందిగామకు చెందిన విశ్రాంత విద్యాశాఖ అధికారి కేజెడ్ఎస్ కుమార్ ఇంటి ఆవరణలోని అరటి చెట్టుకు 9అడుగుల పొడవైన అరటిగెల కాసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో అంతా ఇక్కడికి వచ్చి అరటి గెలను ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. ఈ అరటి చెట్టును పదేళ్ల క్రితం నాటినట్లు ఇంటి యజమాని తెలిపారు. ఈ మొక్కకు మొదటి నుంచీ ఎరువుగా కూరగాయల వ్యర్థాలను వేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రాంతంలో ఇన్ని అడుగుల పొడవైన అరటిగెలను చూడటం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ అరటి గెలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బచ్చలికూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..
Updated Date - Jan 19 , 2024 | 06:10 PM