ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: మెటల్ డిటెక్టర్ పదే పదే సౌండ్ చేస్తుండడంతో మట్టిలో తవ్వాడు.. చివరకు లోపల చూడగా..

ABN, Publish Date - May 07 , 2024 | 06:14 PM

ఓ వ్యక్తి మెటల్ డిటెక్టర్ పట్టుకుని చెట్లతో నిండిపోయిన ప్రాంతంలో వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతడు ఓ పెద్ద చెట్టు పక్కన ఉన్న మట్టి గోడపై మెటల్ డిటెక్టర్‌తో పరిశీలిస్తుంటాడు. ఇలా పరిశీలిస్తుండగా...

తవ్వకాలు చేస్తుండగా కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు దేనికోసమో తవ్వు్తుంటే.. చివరకు ఇంకేదో బయటపడుతుంది. ఇంకొన్నిసార్లు బంగారం కోసం తవ్వితే.. మట్టి, రాళ్లు తప్ప ఇంకేమీ కనిపించదు. మరికొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా నిధులు బయటపడుతుంటాయి. ఇలాంటి ఊహించని ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మెటల్ డిటెక్టర్ పదే పదే సండ్ చేస్తుండడంతో ఓ వ్యక్తి మట్టిలో తవ్వకాలు చేపట్టాడు. చివరకు షాకింగ్ దృశ్యం కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మెటల్ డిటెక్టర్ (Metal detector) పట్టుకుని చెట్లతో నిండిపోయిన ప్రాంతంలో వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతడు ఓ పెద్ద చెట్టు పక్కన ఉన్న మట్టి గోడపై మెటల్ డిటెక్టర్‌తో పరిశీలిస్తుంటాడు. ఇలా పరిశీలిస్తుండగా అతడికి మధ్యలో ఒక్కసారిగా బీప్ సౌండ్ వస్తుంది. దీంతో అందులో ఏమైనా ఉంటుందేమో అని ఇనుప గునపంతో మట్టిని తవ్వుతాడు. కొద్దిసేపు తవ్వగానే మళ్లీ మెటల్ డిటెక్టర్‌తో పరిశీలిస్తాడు. మళ్లీ బీప్ సౌండ్ రావడంతో ఎంతో కాన్ఫిడెంట్‌గా మళ్లీ తవ్వడం స్టార్ట్ చేస్తాడు.

Viral video: చేపనేమో పట్టాడు గానీ.. దాని వెంటే వచ్చిన అతి పెద్ద అతిథిని చూసి షాక్.. చివరకు..


చివరకు లోపలి నుంచి అనేక బంగారు వస్తువులు (Gold items) బయటపడతాయి. వాటిలో కొన్ని మెరుస్తూ కనిపిస్తాయి. అక్కడ పాతి పెట్టి ఉన్న చిన్న మట్టి కుండ పగిలిపోయి ఉంటుంది. ఆ వస్తువులన్నీ అందులో నుంచే బయటకు వచ్చాయి. ఇది అంత నమ్మేలా లేకున్నా కూడా.. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘వావ్..! ఇది అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా చూస్తుంటే నమ్మేలా లేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ముందే ఆ వస్తువులు లోపల పెట్టి.. ఇలా తవ్వుతున్నట్లు నటించారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం పది వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఎలుగుబంటితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి.. ఈ పులికి ఎలాంటి షాక్ ఇచ్చిందంటే..

Updated Date - May 07 , 2024 | 06:14 PM

Advertising
Advertising