ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిల్లిని చూసి జాలి పడిన కుక్క.. చివరకు ఏం చేసిందో చూడండి..

ABN, Publish Date - Jul 06 , 2024 | 07:14 PM

కుక్క, పిల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. కుక్కను చూడగానే పిల్లి అమాడ దూరం పారిపోతుంది. అదేవిధంగా పిల్లిని చూడగానే కుక్క కూడా వెంటనే దాడికి దిగుతుంది. అయితే కొన్నిసార్లు ...

కుక్క, పిల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. కుక్కను చూడగానే పిల్లి అమాడ దూరం పారిపోతుంది. అదేవిధంగా పిల్లిని చూడగానే కుక్క కూడా వెంటనే దాడికి దిగుతుంది. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కుక్కనే భయపెట్టిన పిల్లులను కూడా చాలా సార్లు చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ కుక్క, పిల్లికి మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పిల్లిని చూసి జాలిపడిన కుక్క చివరకు ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెంపుడు కుక్క (pet dog) ఇంటి గేటు పక్కన ఆహారం తింటూ ఉంటుంది. అయితే ఇంలో బక్కచిక్కిన పిల్లి దాని సమీపానికి వస్తుంది. పిల్లి ఆకలితో ఉండడాన్ని గమనించిన కుక్క వెంటనే స్పందిస్తుంది. తినడాన్ని ఆపేసి పిల్లి తినేందుకు వదిలేస్తుంది. ‘‘నిన్ను ఏమీ చేయను.. పాపం.. ఆకలితో ఉన్నట్టున్నావ్.. భయపడకుండా తినేసెయ్’’.. అన్నట్లుగా పిల్లిని చూసి ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Viral Video: యజమానిపై పగ తీర్చుకున్న కుక్క.. వంటింట్లో అది చేసిన పని చూస్తే..


అయినా పిల్లి మొదట భయం భయంగానే ఆహారం తినేందుకు ప్రయత్నిస్తుంటుంది. దీన్ని గమనించిన కుక్క దూరంగా వెళ్లి నిలబడి.. ‘‘ఏం భయం లేదు.. ప్రశాంతంగా తిను’’.. అన్నట్లుగా దాని వైపు జాలిగా చూస్తూ హామీ ఇస్తుంది. దీంతో చివరకు పిల్లి (cat) ధైర్యంగా అక్కడున్న ఆహారాన్ని (eating food)తినేసి తన ఆకలి తీర్చుకుంటుంది. ఈ ఘటనను కుక్క యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Viral Video: పోట్లాడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన ఎద్దులు.. అప్పుడే దూసుకొచ్చిన రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ కుక్క మనసు ఎంతో గొప్పది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్కను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మెట్రోలో వృద్ధుడి వికృత చేష్టలు.. చిరిగిన యువతి జీన్స్‌ చూసి.. పక్కనే కూర్చుని..

Updated Date - Jul 06 , 2024 | 07:14 PM

Advertising
Advertising
<