Viral Video: ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వెహికల్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..
ABN, Publish Date - May 23 , 2024 | 12:48 PM
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది. సాధారణంగా ఆసుపత్రుల్లోని ఎమర్జెనీ వార్డులోకి వాహనాలు వెళ్లడం అసాధ్యం. ఎవరైనా పేషెంట్లను అత్యవసరంగా తీసుకెళ్లాలన్నా ఎంట్రన్స్ వరకు అంబులెన్స్‌లో తీసుకెళ్లి అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్తుంటారు. కానీ రిషికేశ్ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నేరగా తమ వాహనంలో ఆసుపత్రి ఆరో అంతస్తులోని ఎమర్జెనీ వార్డుకు వెళ్లారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలను తలపించేలా ఉన్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగింది..
రిషికేష్‌లోని సర్జరీ యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించారని ఒక మహిళా జూనియర్ డాక్టర్ ఆరోపించారు. అలాగే తనకు నర్సింగ్ అధికారి అసభ్యకర మెసేజ్‌లు పంపించారని పోలీసులకు జూనియర్ డాక్టర్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ఇతర వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు జూనియర్ డాక్టర్‌కు మద్దతుగా నిలిచారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నర్సింగ్ అధికారిని అరెస్ట్ చేసేందుకు ఎయిమ్స్‌కు పోలీసులు చేరుకున్నారు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది ప్రవేశద్వారం వద్ద ఆందోళన చేస్తుడంటంతో పోలీసులు నేరుగా తమ వాహనంతో ఆరో అంతస్తులోని ఎమర్జెనీ వార్డుకు వెళ్లి.. నర్సింగ్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ కోసం..
పోలీసు వెహికల్ ఆసుపత్రి లోపలికి వెళ్లగా వాహనం ముందుకు కదిలేందుకు బెడ్‌లు అడ్డురాగా.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పేషెంట్లు ఉన్న బెడ్లను పక్కకు జరిపి పోలీసు వాహనం ముందుకు వెళ్లేలా సహకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిందితుడిని అరెస్ట్ చేయడం కోసం ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. జూనియర్ డాక్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం నర్సింగ్ అధికారిని సస్పెండ్ చేసింది. అయితే అతడిని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డుకు పోలీసులు తమ వాహనంలోకి వెళ్లడం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News
Updated Date - May 23 , 2024 | 01:35 PM