Share News

Viral: ఆర్టీసీ బస్సు ఫ్లోర్ డిజైన్‌తో సరికొత్త బ్యాగ్.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే..

ABN , Publish Date - Sep 22 , 2024 | 11:05 AM

ప్రద.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ బ్రాండ్లలో ఒకటి. ఫ్యాషన్ హద్దుల్ని చెరిపేస్తూ సరికొత్త డిజైన్లతో వినియోగదారుల మనసులను చూరగొంటుంది. అందుకే ఖరీదు ఎక్కువైనా ప్రద బ్రాండ్‌కు ఆదరణ మాత్రం తరగడం లేదు. తాజాగా ఆ సంస్థ ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ను విడుదల చేసింది.

Viral: ఆర్టీసీ బస్సు ఫ్లోర్ డిజైన్‌తో సరికొత్త బ్యాగ్.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం కళ్లు తేలెయ్యాల్సిందే..
Prada's ₹ 2.73 Lakh Metallic Tote Bag

ప్రద (Prada).. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ బ్రాండ్ల (Luxury brand)లో ఒకటి. ఫ్యాషన్ హద్దుల్ని చెరిపేస్తూ సరికొత్త డిజైన్లతో వినియోగదారుల మనసులను చూరగొంటుంది. అందుకే ఖరీదు ఎక్కువైనా ప్రద బ్రాండ్‌కు ఆదరణ మాత్రం తరగడం లేదు. తాజాగా ఆ సంస్థ ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ (Coslty Hand Bag)ను విడుదల చేసింది. ఆ మెటాలిక్ టాటే బ్యాగ్ ఖరీదు ఏకంగా రూ.2.73 లక్షలు. ఈ బ్యాగ్‌ను పురుషుల కోసం డిజైన్ చేశారట. అయితే ఈ బ్యాగ్ డిజైన్ మాత్రం విమర్శల పాలవుతోంది. ఎందుకంటే భారతీయ బస్సులు, రైళ్ల ఫ్లోరింగ్ (Bus floors) కోసం ఉపయోగించే డిజైన్‌నే ఈ బ్యాగ్ కోసం వాడారు.


మెటాలిక్ బ్యాగ్, హాట్-స్టాంప్డ్ లెదర్ మోటిఫ్‌ను కలిగి ఉన్న ఆ బ్యాగ్‌లో సాధారణ ప్రద డిజైనింగ్ లోపించింది. డస్ట్ బ్యాగ్, డెడికేటెడ్ వాటర్ బాటిల్ కంపార్ట్‌మెంట్‌తో ఉన్న ఈ బ్యాగ్ చూడడానికి చాలా సాధారణంగా కనిపిస్తోంది. ఈ బ్యాగ్‌కు అసాధారణ ధర నిర్ణయించడం చాలా మందికి విస్మయం కలిగిస్తోంది. ఈ బ్యాగ్ డిజైన్‌పై, ఖరీదుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ సాగుతోంది. ఈ బ్యాగ్ ప్రద బ్రాండ్‌కు చెందిన ఫ్యాషన్-ఫార్వర్డ్ స్టేట్‌మెంటా? లేదా విచిత్రమైన డిజైన్ కోసం రూపొందించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


ఏదేమైనా ఈ బ్యాగ్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ``ఫ్యాషన్ అంటే మీతో పాటు ప్రజా రవాణాను తీసుకెళ్లడం అని నాకు తెలియదు``, ``ఇండియన్ బస్సుల నుంచి స్ఫూర్తి పొందారా``, ``చాలా ఫన్నీగా ఉంది``, ``ఈ బ్యాగ్ కోసం అంత ధర ఎందుకు`` అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ప్రముఖ ఫ్రెంచ్ బ్రాండ్ లూయిస్ విట్టన్ కూడా ఓ హ్యాండ్ బ్యాగ్ ధరను రూ.2.8 లక్షలుగా నిర్ణయించింది. ఆ తోలుతో తయారు చేసిన ఆ బ్యాగ్‌పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ దృష్టి ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేసుకోండి.. ఫ్లెమ్మింగో‌ల మధ్య ఉన్న అమ్మాయిని కనిపెట్టండి..


Viral Video: ఈ పేదవాడి మనసు చాలా పెద్దది.. చెప్పులు కుట్టే ఈ వ్యక్తి కోసం ఎంతో మంది ఎందుకు స్పందించారంటే..


Viral Video: షాకింగ్ వీడియో.. కళ్ల ముందే భూమిలోకి వెళ్లిపోయిన ట్రక్.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడంటే..


Optical Illusion: ఈ లైబ్రరీలో గంట ఎక్కడుందో వెతకండి.. 10 సెకెన్లలో వెతికితే మీ కళ్లకు తిరుగులేనట్టే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 22 , 2024 | 11:05 AM