ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బస్సులో ప్రయాణికుడిని 26 సార్లు చెంప ఛెళ్లుమనిపించిన మహిళ!

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:16 PM

తాగి బస్సెక్కిన ఓ వ్యక్తికి తోటి ప్రయాణికురాలు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: తాగి బస్సెక్కిన ఓ వ్యక్తికి తోటి ప్రయాణికురాలు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పింది. పూణెలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పద్ధతి తప్పిన అతడిని ఆమె ఏకిపారేసిన తీరు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. తగిన శాస్తే జరిగిందని కొందరు అంటున్నారు (Viral).

Viral: పబ్లిక్‌గా జంట అధర చుంబనాలు.. మెట్రో స్టేషన్‌లో షాకింగ్ సీన్!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి మద్యం మత్తులో బస్సు ఎక్కాడు. ఆ తరువాత బస్సు దిగే క్రమంలో ఓ మహిళను అసభ్యంగా తాకాడు. దీంతో, ఆమెకు తిగ్గరేగడంతో అతడిని కాలర్ పట్టుకుని నిలబెట్టి మరీ దుమ్ముదులిపేసింది. చెడామడా చెంపలు వాయించేసింది. ఆమె దెబ్బలకు ప్రయాణికుడు షాకైపోయాడు. చివరకు కాళ్లబేరానికి వచ్చాడు. సారీ సారీ.. తెలీక జరిగిందీ అంటూ.. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతడి దుర్బుద్ధి గురించి తెలిసిన ఆమె అతడి కాలర్ వదలకుండా 26 సార్లు చెంపలు వాయించింది. సారీ చెబితే సరిపోతుందా అంటూ తన కోపం అంతా తీరిపోయేలా కొట్టింది.

Viral: ఈ ఏనుగుకు ఎంత మర్యాద! తన దారికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తిని..


ఆమె ఉగ్రరూపం చూసి ఇతర ప్రయాణికుల్లో ఒక్కరు కూడా కల్పించుకోలేదు. మౌనంగా అలా చూస్తుండిపోయారు. చివర్లో కండక్టర్ జోక్యం చేసుకుని మహిళను శాంతిపంజేశారు. అయినా గానీ వెనక్కు తగ్గేదే లేదన్న మహిళ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ముందు ఆపాలంటూ పట్టుబట్టింది. ఆ తరువాత ఏం జరిగిందీ వీడియోలో తెలియరాలేదు.

ఈ వీడియో చూసిన జనాలు మాత్రం మహిళపై ప్రశంసలు కురిపించారు. దుర్బుద్ధి ప్రదర్శించిన ప్రయాణికుడికి తగిన శాస్తే చేసిందంటూ ప్రశంసించారు. ‘‘మద్యం తాగాలనుకుంటే ఇంట్లో ఉండిపోవాలి. పబ్లిక్ ప్లేసుల్లో మహిళలను వేధించడం అస్సలు కరెక్టు కాదు’’ అని కొందరు అన్నారు. స్వీయ రక్షణ అంటే ఇదీ.. పబ్లిక్ ప్లేసుల్లో వేధింపులకు దిగితే ఈ గతే పడుతుందని అందరికీ తెలియాలి అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలాంటి కుసంస్కారికి తగిన విధంగా దేహశుద్ధి జరిగిందని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

Viral: 43 ఏళ్లల్లో 12 సార్లు విడాకులు తీసుకుని మళ్లి కలిసిపోయారు! ఎందుకంటే..

Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!

Read Latest and Viral News

Updated Date - Dec 19 , 2024 | 05:25 PM