ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నడి రోడ్డుపై జింకను చుట్టేసిన కొండచిలువ.. చంపేసే సమయంలో ఉన్నట్టుండి..

ABN, Publish Date - Jul 21 , 2024 | 07:34 PM

కొండచిలువులు ఒక్కసారి దాడి చేశాయంటే.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో...

కొండచిలువులు ఒక్కసారి దాడి చేశాయంటే.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద కొండచిలువను చుట్టేసింది. అయితే తీరా చంపేసే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ కొండచిలువకు నడి రోడ్డుపై జింక తారసపడుతుంది. వెంటనే దానిపై (Python attack on deer) దాడి చేస్తుంది. ఒక్కసారిగా చుట్టేయడంతో దాని బారి నుంచి తప్పించుకోవడానికి జింక విశ్వప్రయత్నాలు చేస్తుంది. అయినా సాధ్యం కాదు. ఈ క్రమంలో అటుగా వచ్చిన వాహనదారులు ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు. వాహనాలు ఆపి వాటిని గమనిస్తున్నారు.

Viral Video: ఇదెక్కడి కేక్ కటింగ్‌రా అయ్యా.. ఇతను చేసిన పని చూస్తే..


అయితే వాహనదారుల్లో ఓ వ్యక్తి జింకను కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఓ చెట్టు కొమ్మ పట్టుకుని కొండచిలువను అదిలించే ప్రయత్నం చేస్తాడు. అయితే ముందు కొండచిలువ అతడిని కూడా భయపట్టే ప్రయత్నం చేస్తుంది. అయినా సదరు వ్యక్తి భయపడకుండా కర్రతో కొండచిలువ దగ్గరికి వెళ్లి కొట్టే ప్రయత్నం చేస్తాడు. దీంతో చివరకు కొండచిలువ భయంతో జింకను వదిలి పారిపోతుంది.

Viral Video: గోడపై గాడిద పెయింటింగ్.. నిజమని నమ్మిన ఈ గాడిద.. దగ్గరికి వెళ్లి..


కొండచిలువ వదిలేయగానే.. బతుకుజీవుడా.. అనుకుంటూ జింక అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఆహార వేటలో ఇదంతా మామూలే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 39 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

Updated Date - Jul 21 , 2024 | 07:35 PM

Advertising
Advertising
<