ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RAILOFY: ట్రైన్ జర్నీలో ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఇలా ఆర్డర్ చేయొచ్చు

ABN, Publish Date - Oct 28 , 2024 | 02:29 PM

బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే సామాన్యులు రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే చాలామంది ప్రయాణీకులకు ఆహారానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రత ప్రమాణాలు సరిగా లేకపోవడంతో రైల్వే స్టేషన్లలో దొరికే ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇందుకు ఓ చక్కటి పరిష్కారం మార్గం ఉంది.

Train journey

ఇండియన్ రైల్వేస్ ఆహార పదార్థాల నాణ్యతపై ఈ మధ్య తెగ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. క్వాలిటీగా, టెస్టీగా లేవంటూ కంప్లైంట్లు పెరిగిపోతున్నాయి. మరోవైపు పండుగల సీజన్‌లో చాలా మంది తమ స్వస్థలాలకు చేరుకునేందుకు సుదూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రయాణీకులు ఆకలి తీర్చుకోవడం ఒక ప్రహసనంగా మారిపోయింది. దీనికి పరిష్కారంగా ఐఆర్‌సీటీసీ (IRCTC) భాగస్వామి అయిన రైల్ఓఎఫ్‌వై (RAILOFY) ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా రైల్వే ప్రయాణీకులు హల్దీరామ్, సబ్‌వే, బికనెర్వాలా వంటి మరికొన్ని ప్రముఖ రెస్టారెంట్‌ల నుంచి ఫ్రెష్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆహారాన్ని నేరుగా తమ సీట్ల వద్దకే తెప్పించుకోవచ్చు.


నిజానికి ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది ప్రయాణీకులకు తెలియదు. నచ్చిన ఫుడ్ లభించక నానా అవస్థలు పడుతున్నారు. రైల్ఓఎఫ్‌వై‌పై ప్రయాణీకులు చాలా సులభంగా వాట్సప్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టవచ్చు. ఇందుకోసం రైల్ఓఎఫ్‌వై‌ వాట్సప్ చాట్‌బాట్‌ను ఉపయోగించితే సరిపోతుంది. ఈ విధానంలో చాలా సులభంగా ఆర్డర్ చేయవచ్చు. వినియోగానికి సులభంగా ఉండేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. అంతేకాదు ఫుడ్ ఆర్డర్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. పేమెంట్ ఆప్షన్లు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్డర్ చేసేటప్పుడు లేదా ఆహారాన్ని స్వీకరించే సమయంలో కూడా చెల్లింపునకు అవకాశం ఉంటుంది.


ఆర్డర్ ఎలా చేయాలి?

ప్రయాణీకులు ముందుగా వారి సెల్‌ఫోన్‌లో +91 74411111266 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక చాట్‌ మొదలుపెట్టవచ్చు. ఆర్డర్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు ఆ నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత నచ్చిన భాష ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం పీఎన్ఆర్, పేరు వివరాలు నమోదు చేయాలి. ఫుడ్ ఆర్డర్ బుకింగ్ కోసం పీఎన్ఆర్ నంబర్, పేరు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ స్టేషన్‌లో డెలివరీ కావాలో ఎంచుకోవాలి. స్టేషన్ ఎంచుకున్న తర్వాత రెస్టారెంట్, మెనూని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లిస్టులో అందుబాటులో ఉన్న రెస్టారెంట్ల జాబితాను పరిశీలించి నచ్చిన ఫుడ్‌ని ఎంచుకోవాలి. అంతే మీరు కోరుకున్న మీ సీటు వద్దకే వచ్చేస్తుంది. కావాలనుకుంటే ఆర్డర్‌ను ట్రాక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.


ఈ ఫీచర్ గత కొంతకాలంగా అందుబాటులో ఉంది. కానీ చాలామందికి ఇప్పటికీ తెలియదు. అవగాహన ఉన్న ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క క్లిక్‌తో సులభంగా ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు వీలుంది. తద్వారా రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.


ఇవి కూడా చదవండి

విమాన ప్రయాణంలో శునకం మృతి.. యజమాని ఏం చేశాడంటే

ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే

ఆ కాలంపోయింది.. కివీస్ చేతిలో భారత్ ఓటమిపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Oct 28 , 2024 | 02:33 PM