ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

VandeBharat: వందేభారత్ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?

ABN, Publish Date - Feb 19 , 2024 | 06:40 PM

ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లలో వందేభారత్ రైళ్లను శుభ్రపరిచే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత రైల్వే శాఖ నిర్వహిస్తున్న అత్యాధునిక వందేభారత్ రైళ్లు (Vande Bharat) ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. ఎన్నో వసతులతో సౌకర్యవంతంగా ఉండే ఈ రైళ్ల నిర్వహణ ఎలా ఉంటుందో చెబుతూ రైల్వే శాఖ (Ministry of Railways) నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ (ViralVideo) అవుతోంది.

Google Pune Office: గూగుల్‌లో జాబ్ కోసం ఎగబడేది ఇందుకే.. ఒక్కసారి వాళ్ల ఆఫీసుకు వెళితే..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వందేభారత్‌ రైళ్లను శుభ్రపరిచే అత్యాధునిక ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లను (Automatic Cleaning plant) దేశవ్యాప్తంగా 73 చోట్ల ఏర్పాటు చేశారు. అతితక్కువ ఖర్చు, నీటివినియోగంతో రైళ్లను శుభ్రపరచడం వీటి ప్రత్యేకత. ఈ క్లీనింగ్ ప్లాంట్ కేవలం 20 నిమిషాల్లోనే 24 కోచ్‌లు ఉన్న రైలును శుభ్రపరచగలదు.

Viralvideo: పెళ్లి దుస్తుల్లో పోలీసు కానిస్టేబుల్ పరీక్ష కేంద్రానికి వచ్చిన వరుడు! ఏం జరిగిందని అడిగితే..


గతేడాది అక్టోబర్‌లో ఈ క్లీనింగ్ ప్లాంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. అత్యధిక ఒత్తిడితో నీటిని చిమ్ముతూ ఈ ప్లాంట్‌లు రైళ్లను శుభ్రపరుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. నిలువుగా, అడ్డంగా ఉండే పలు ఆటోమేటిక్ బ్రష్‌లు రైళ్లను పూర్తిగా శుభ్రపరుస్తాయని వెల్లడించింది. ఇవి పర్యావరణహితకర పద్ధతులను అవలంబిస్తాయని కూడా పేర్కొంది. ప్రయాణాల్లో సమయపాలన కోసం ఈ మోడర్న్ క్లినింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది. బుల్లెట్ రైళ్లను శుభ్రపరిచేందుకు జపాన్‌లో ఉపయోగించే టెక్నాలజీ ఆధారంగా దీన్ని భారత్‌లో ప్రవేశపెట్టినట్టు తెలిపింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2024 | 06:44 PM

Advertising
Advertising