Share News

Raksha Bandhan: మీ సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఈ విషయలు తప్పక తెలుసుకోండి..

ABN , Publish Date - Aug 19 , 2024 | 07:54 AM

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. తమ అన్నదమ్ములకు.. అక్కా, చెల్లెల్లు ప్రేమతో రక్ష కడుతుంటారు. ఒకరికొకరు తోడుగా, అండగా, రక్షణగా ఉండాలనే భావనతో రక్షాబంధన్‌ను పండుగ వాతావరణంలో జరుపుకుంటారు.

Raksha Bandhan: మీ సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఈ విషయలు తప్పక తెలుసుకోండి..
Raksha Bandhan

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. తమ అన్నదమ్ములకు.. అక్కా, చెల్లెల్లు ప్రేమతో రక్ష కడుతుంటారు. ఒకరికొకరు తోడుగా, అండగా, రక్షణగా ఉండాలనే భావనతో రక్షాబంధన్‌ను పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో రక్షా బంధన్ చాలా ముఖ్యమైనది.శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. పూర్వకాలంలో రక్షాబంధన్ రోజున గురువులు తమ శిష్యులకు రక్షా సూత్రాన్ని కట్టేవారు. దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, శచీదేవి ఇంద్రుడికి రక్ష సూత్రాన్ని కట్టింది. ప్రస్తుతం అది అన్నదమ్ముల అనురాగానికి ప్రతీకగా మారింది. ఈఏడాది రక్షాబంధన్ రోజు పెద్ద వివాదమే కొనసాగుతోంది. అసలు రాఖీ ఏ సమయంలో కట్టాలనేదానిపై గందరగోళం నెలకొంది. అయితే జ్యోతిష్య శాస్త్ర పండితులు మాత్రం భద్ర కాలంలో రక్షాబంధన్ జరుపుకోకూడదని తేల్చేశారు. సనాతన సంప్రదాయంలో భద్ర లేకుండా ప్రతి పండుగను జరుపుకునే సంప్రదాయం ఉందని, అయితే భద్రను పూర్తిగా నిషేధించినట్లు భావించే రెండు పండుగలు ఉన్నాయని పండితులు తెలిపారు. వాటిలో హోలికా దహన్, రక్షా బంధన్ భద్ర కాలంలో జరుపుకోకూడని రెండు పండుగలుగా చెప్పారు.


భద్రా కాలంలో..

ఆగస్టు 19న తెల్లవారుజామున 2.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.24 గంటల వరకు భద్రకాళం ఉంటుందని జ్యోతిష్య పండితులు పేర్కొన్నారు. ఈ కాలంలో రక్షా బంధన్ జరుపుకోకూడదని, రక్షా సూత్రాన్ని ఏ విధంగానూ కట్టకూడదన్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హోలికను భద్రలో కాల్చడం వల్ల దేశానికి నష్టం జరుగుతుందని, రక్షా బంధన్‌ను జరుపుకోవడం అశుభమని, ఇబ్బందులను ఆహ్వానించడం వంటిదని పండితులు తెలిపారు. భద్ర కాలం కూడా ప్రతికూల శక్తిని ఇచ్చే సమయంగా పరిగణించబడుతుందన్నారు.


రాఖీ ఎప్పుడు.. ఎలా కట్టాలి

ఆగస్ట్ 19 మధ్యాహ్నం 1.25 గంటల తర్వాత రక్షా బంధన్ పండుగను జరుపుకోవాలని జ్యోతిష్యశాస్త్ర పండితులు తెలిపారు. అదే సమయంలో సింథటిక్ రాఖీలకు బదులుగా ఇంట్లోనే రక్షా సూత్రాన్ని సిద్ధం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. పట్టు లేదా పత్తి దారంతో సిద్ధం చేసుకున్న రక్షను పూజా స్థలంలో పెట్టి పూజించి.. రక్షా సూత్రానికి ధూపం, హారతి సమర్పిస్తే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఒక ప్లేట్‌లో రాఖీ పెట్టి తమ సోదరుడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి, తాను పడమర ముఖంగా ఉండి.. అక్షతలను సోదరుడికి వేయాలి. ఆ తరువాత, సోదరి సోదరుడికి మిఠాయిలు తినిపించాలి. సోదరుడు స్వీటు తింటున్నప్పుడు, సోదరి “‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః, తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల’మంత్రాన్ని జపిస్తూ అతని కుడి చేతికి రక్షా సూత్రాన్ని కట్టాలి. ఇలా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలను పెంచి కుటుంబ ఐక్యతను కాపాడే పండుగగా ఈ రక్షా బంధన్ నిలిచిపోతుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telugu Latest News Click Here

Updated Date - Aug 19 , 2024 | 07:54 AM