Viral video: మృతదేహాన్ని పక్కన పెట్టుకుని వీళ్లు చేస్తున్న పని చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Jun 28 , 2024 | 03:36 PM

మృతదేహం పరిసరాల్లో విషాదకర వాతావరణం ఉండడం సర్వసాధారణం. బంధువుల ఏడుపులతో చూస్తున్న వారికి కూడా కన్నీళ్లు తెప్పించేలా ఉంటుంది. అయితే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో..

Viral video: మృతదేహాన్ని పక్కన పెట్టుకుని వీళ్లు చేస్తున్న పని చూస్తే.. నోరెళ్లబెడతారు..
ప్రతీకాత్మక చిత్రం

మృతదేహం పరిసరాల్లో విషాదకర వాతావరణం ఉండడం సర్వసాధారణం. బంధువుల ఏడుపులతో చూస్తున్న వారికి కూడా కన్నీళ్లు తెప్పించేలా ఉంటుంది. అయితే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో కొంత మంది డాన్సులు వేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మృతదేహాన్ని పక్కన పెట్టుకుని బంధువులు చేస్తున్న పని చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మరణించాడని తెలుసుకున్న బంధువులు ఆఖరిచూపు కోసం గ్రామానికి చేరుకున్నారు. వారి రాక కోసం కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచారు. రాత్రి సమయానికి కల్లా బంధువులంతా గ్రామానికి చేరుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతదేహం వద్ద సంతాపం తెలియజేయాల్సిన బంధువులు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు.

Woman: ‘‘నేను శివుడు, నువ్వు పార్వతి’’.. మహిళకు వింత కథ చెప్పిన మరో మహిళ.. చివరకు..


కొందరు ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే.. మరికొందరు (Relatives playing games at the dead body) పేకట ఆడుతుండగా, ఇంకొందరు వివిధ రకాల ఆటలు ఆడుతూ సరదా సరదాగా గడుపుతుంటారు. వారందరిలో కొంచెం కూడా బాధ కనిపించదు. ఏదో టైం పాస్ చేయడానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది ఫ్రీ ఫైర్ మానియా’’.. అంటూ కొందరు, ‘‘నో ఉమన్... నోడ్రామా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: వామ్మో..! పాకిస్థాన్‌లో ఇలా చేస్తారా.. కదులుతున్న రైలుపై ఆకతాయిలు నీళ్లు చల్లడంతో చివరకు..

Updated Date - Jun 28 , 2024 | 03:36 PM

Advertising
Advertising