Viral Video: తెల్ల చొక్కాపై మరకలను తొలగించడం ఇంత ఈజీనా.. ఇతడు వాడిన ట్రిక్ చూస్తే మతిపోవాల్సిందే..
ABN, Publish Date - Nov 19 , 2024 | 08:51 PM
ఓ యువకుడు తెల్ల టీషర్ట్‌పై మరకలను ఎంతో సులభంగా పోగొట్టి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ముందుగా అతను మొత్తం మరకలతో నిండిన తెల్లటి టీషర్ట్‌ను తీసుకుంటాడు. ఆ తర్వాత ఓ మగ్‌లో నీటిని తీసుకుని, అందులో..
కొందరు చిన్న చిన్న టెక్నిక్‌లు వాడి పెద్ద పెద్ద సమస్యలను సులభంగా పరిష్కరించడం చూస్తుంటాం. ఇంకొందరు అంతా రోజూ వాడే వస్తువులతోనే వినూత్న ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు సింపుల్ ట్రిక్‌తో తెల్ల చొక్కాపై మొడి మరకలను వదలగొట్టిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ తెల్ల చొక్కాపై మరకలను తొలగించడం ఇంత ఈజీనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తెల్ల టీషర్ట్‌పై మరకలను ఎంతో సులభంగా పోగొట్టి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ముందుగా అతను మొత్తం మరకలతో (stained t-shirt) నిండిన తెల్లటి టీషర్ట్‌ను తీసుకుంటాడు. ఆ తర్వాత ఓ మగ్‌లో నీటిని తీసుకుని, అందులో కొద్దిగా సర్ఫ్ (Surf) వేస్తాడు. ఆ తర్వాత ఓ నిమ్మకాయను (lemon) ఆ నీటిలో పిండుతాడు.
చివరగా ఈనో ప్యాకెట్‌ను (ENO packet) ఓపెన్ చేసి అందులో మిక్స్ చేస్తాడు. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఆ నీటిలో మరకలు పడ్డ టీషర్ట్‌ను కాసేపు నానబెట్టి బయటికి తీస్తాడు. తర్వాత నేలపై వేసి రుద్ది, నీటిలో పిండేస్తాడు. ఫైనల్‌గా చూడగా మరకల టీషర్ట్ కాస్తా.. తెల్లగా మెరిసిపోయి కనిపిస్తుంది. ఇలా అందుబాటులో ఉన్న వస్తువులతో మరకలు పడ్డ టీషర్ట్‌ను తెల్లగా మార్చిన ఈ వ్యక్తిని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: ఉడుము పవర్ అంటే ఇదీ.. నాగుపామును పట్టుకోగానే ఏం జరిగిందో చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈనోతో దుస్తులు వాషింగ్.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా ఫేక్.. ఎడిటింగ్ చేసి తీశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 39 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 19 , 2024 | 08:51 PM