Share News

Viral: ఇదెక్కడి రూల్ నాయనా? బెంగళూరులోని ఆ మాల్‌లో రెస్ట్‌రూమ్‌ వాడుకోవాలంటే..

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:13 AM

దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్ సిటీ బెంగళూరులో సామాన్యులు బతకడం అంటే మాటలు కాదు. ఇంటి అద్దె కళ్లు చెదిరే స్థాయిలో ఉంటుంది. అలాగే బెంగళూరులో ట్రావెల్ చేయడం, హోటల్స్‌కు వెళ్లి తినడం అంటే జేబుకు చిల్లు పడడం ఖాయం. బెంగళూరులో అడుగడుగునా వీఐపీ కల్చర్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది.

Viral: ఇదెక్కడి రూల్ నాయనా? బెంగళూరులోని ఆ మాల్‌లో రెస్ట్‌రూమ్‌ వాడుకోవాలంటే..
restroom of the mall in Bangalore

దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్ సిటీ బెంగళూరు (Bengaluru)లో సామాన్యులు బతకడం అంటే మాటలు కాదు. ఇంటి అద్దె కళ్లు చెదిరే స్థాయిలో ఉంటుంది. అలాగే బెంగళూరులో ట్రావెల్ చేయడం, హోటల్స్‌కు వెళ్లి తినడం అంటే జేబుకు చిల్లు పడడం ఖాయం. బెంగళూరులో అడుగడుగునా వీఐపీ కల్చర్ (VIP Culture) కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తాజాగా ఓ మాల్‌లో రెస్ట్ రూమ్ (washroom) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రెస్ట్ రూమ్‌ను ఎవరు పడితే వారు వాడుకోవడానికి కుదరదట. ఓ వ్యక్తి తనకెదురైన అనుభవాన్ని రెడ్డిట్ ద్వారా వెల్లడించాడు (Viral News).


DeskKey9633 అనే రెడ్డిట్ యూజర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ వ్యక్తి గత వారం బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ఫీనిక్స్ మార్కెట్ సిటీ మాల్‌కు వెళ్లాడు. షాపింగ్ అయిన తర్వాత మాల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వాష్‌రూమ్‌కు వెళ్లాలనుకున్నాడు. అక్కడ ఒక మహిళా సెక్యూరిటీ గార్డు ఉంది. వాష్‌రూమ్‌కు వెళ్తుంటే ఆపి బిల్లు చూపించమని అడిగింది. వెయ్యి రూపాయలకు పైగా షాపింగ్ చేస్తేనే వాష్‌రూమ్‌లోకి అనుమతిస్తామని ఆమె చెప్పడంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. ఆ వ్యక్తి బిల్లు రూ.1000కి తక్కువ ఉండడంతో అతడిని లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో ఆ వ్యక్తి తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.


ఆ పోస్ట్ వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఇది సామాజిక వివక్ష తప్ప మరొకటి``, ``ఇంత వీఐపీ కల్చర్ ఎందుకు``, ``అంత ఛార్జ్ చేస్తున్న ఆ మాల్‌లో వాష్‌రూమ్స్ క్లీన్‌గా ఉండవు``, ``నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది``, ``ఇది నిజంగా దారుణం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ బ్రెయిన్‌ స్పీడ్‌కు అసలైన టెస్ట్.. ఆ బాక్సుల మధ్య తాళం చెవి ఎక్కడుందో కనుక్కోండి..


Titanic: టైటానిక్ మునిగినపుడు ఎంత చలి ఉండేది.. ఒళ్లు గగుర్పొడిచే ఆ అనుభవం కావాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..


Anand Mahindra: వెనిస్‌లో కూడా ముంబై తరహా ట్రాఫిక్ జామ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..


Viral Video: పాపం.. హీరోలా దూసుకుపోదాం అనుకున్నాడు.. చివరకు రెండు బస్సులు మధ్య ఇరుక్కున్నాడు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2024 | 11:13 AM