ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: లక్షలు ఖర్చు చేసి రొబోట్ కుక్కను తెచ్చాడు.. చివరకు మొరగమని చెప్పడంతో అది చేసిన నిర్వాకం..

ABN, Publish Date - Sep 03 , 2024 | 09:08 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనుషులు చేసే పనులన్నీ రొబోలే చేసే వెసులుబాటు వచ్చింది. చివరకు జంతువుల తరహాలోనూ రొబోలు చేసి మార్కెట్లోకి వదలడం చూస్తున్నాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనుషులు చేసే పనులన్నీ రొబోలే చేసే వెసులుబాటు వచ్చింది. చివరకు జంతువుల తరహాలోనూ రొబోలు చేసి మార్కెట్లోకి వదలడం చూస్తున్నాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రొబోట్ కుక్కను తయారు చేసిన వ్యక్తి.. చివరకు మొరగమని చెప్పాడు. అయితే చివరకు అది చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు పగలబడి నవ్వకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అమెరికన్ యూట్యూబర్ (American YouTuber).. రూ. 84 లక్షలు ఖర్చు చేసి చైనా నుంచి అచ్చం కుక్కలా పని చేసే రోబోను తీసుకొస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. దాన్ని పరీక్షించేందుకు అతను స్విమ్మింగ్‌ఫూల్ వద్దకు తీసుకొస్తాడు. పూల్ ఒడ్డున దాన్ని నిలబెట్టి.. ముందుగా వివిధ రకాల సూచనలు ఇస్తాడు.

Viral Video: మొసలి నోట్లోనే చేయి పెట్టిన వ్యక్తి.. చివరకు రెప్పపాటు కాలంలో ఏం జరిగిందో మీరే చూడండి..


కూర్చోవడం, లేవడం, ష్యేక్ హ్యాండ్ ఇవ్వడం వంటివి చెప్పగానే అచ్చం అలాగే చేస్తుంది. ఆ తర్వాత అతను గెంతగానే రోబో (robot dog) కూడా గెంతుతుంది. ఇంతవరకూ అన్నీ సక్రమంగా చేసిన రొబోట్.. ఇక్కడే అసలు షాక్ ఇస్తుంది. చివరగా అతను భౌ.. భౌ.. మని మొరగమని సూచిస్తాడు. అయితే ఆ కుక్క మొరగకుండా చివరకు అతడిపై నిప్పు రవ్వలను చిమ్ముతుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. మంటలు అంటుకోవడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి నీళ్లలో దూకేస్తాడు. ఇలా నీళ్లలోకి దూకినా అది మాత్రం అతన్ని వదలకుండా నిప్పులు చిమ్ముతూ ఉంటుంది.

Viral Video: ఐదు రూపాయల ఐస్‌క్రీంను లొట్టలేసుకుని తింటున్నారా.. ఈ వీడియో చూస్తే.. ఆలోచనలో పడతారు..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ రొబో కుక్క భలే షాక్ ఇచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా ఫన్నీ రొబోలా ఉందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 42 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 03 , 2024 | 09:08 PM

Advertising
Advertising