ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Excise policy case: లిక్కర్ కేసు నిందితుడు విజయ్ నాయర్‌కు బెయిలు

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:16 PM

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో 'ఆమ్ ఆద్మీ పార్టీ' మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్‌ కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో 23 నెలలుగా తీహార్ జైలులో ఉన్న నాయర్‌కు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది.

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise policy)కి సంబంధించిన ఈడీ కేసులో 'ఆమ్ ఆద్మీ పార్టీ' మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్‌ (Vijay Nair)కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో 23 నెలలుగా తీహార్ జైలులో ఉన్న నాయర్‌కు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. మనీష్ సిసోడియా కేసును ప్రస్తావిస్తూ, అండర్ ట్రయిల్‌గా ఆయనను ఎక్కువ కాలం జైలులో ఉంచరాదని, ఇది సహజ న్యాయానికి విరుద్ధమని పేర్కొంది. దీనికి ముందు సీబీఐ కేసులోనూ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజరు చేసింది. ఈడీ కేసులో తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయన జెలు నుంచి బెయిలుపై విడుదల కావడానికి మార్గం సుగగమైంది.


విజయ్ నాయర్ 2014 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో అసోసియేషన్ కలిగి ఉన్నారు. పార్టీ తరఫున ఫండ్ రైజింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆప్ మీడియా, కమ్యూనికేషన్ వ్యూహకర్తగా కూడా ఉన్నారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో చోటుచేసుకున్న అవకతవకల్లో నాయర్‌కు ప్రమేయం ఉందని సీబీఐ గతంలో ఆరోపించింది. కాగా, ఈడీ కేసులో జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్‌వీన్ భట్టితో కూడిన ధర్మాసనం సోమవారంనాడు తీర్పు చెబుతూ, మనీలాండిరింగ్ కేసులో గరిష్ట శిక్ష ఏడేళ్లు ఉంటుందని, అయితే ఆయన 22 నెలలుగా జైలులోనే ఉన్నారని పేర్కొంది. నాయర్ బెయిల్ అభ్యర్థనపై సమాధానం చెప్పాల్సిందిగా ఆగస్టు 12న ఈడీని సుప్రీం ఆదేశించింది. 2022 నవంబర్ 12న నాయర్‌ను ఈడీ అరెస్టు చేసింది. నాయర్ బెయిల్ అభ్యర్థనను గత ఏడది జూన్ 3న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

https://twitter.com/jitenderkhalsa/status/1830512688041967645

Updated Date - Sep 02 , 2024 | 03:16 PM

Advertising
Advertising