ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: నిధి కోసం వెతుకుతుండగా బయటపడ్డ సంచి.. సడన్‌గా లోపలి నుంచి దూసుకొచ్చిన పాము.. చివరకు..

ABN, Publish Date - Jun 15 , 2024 | 03:51 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అనేక రకాల సంఘటనలు వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటాయి. అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం. కొందరు చేసే పనులు చూస్తే...

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అనేక రకాల సంఘటనలు వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటాయి. అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం. కొందరు చేసే పనులు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నిధి కోసం వెతుకుండగా.. అతడికి ఓ చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరచి చూడగా.. సడన్‌గా లోపలి నుంచి ఓ పాము బయటికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నిధి కోసం బండరాళ్ల మధ్యలో వెతుకుంతుంటాడు. మెటల్ డిటెక్టర్‌తో (Metal detector) పరిశీలిస్తుండగా.. ఓ ప్రాంతంలో ఉన్నట్టుండి సౌండ్ వస్తుంది. దీంతో అక్కడ తవ్వడం మొదలెడతాడు. పెద్ద పెద్ద రాళ్లను ఒక్కొక్కటిగా తొలగిస్తాడు. తర్వాత వాటి కింద ఉన్న మట్టిని తొలగిస్తాడు. ఈ తర్వాత మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేయగా.. సౌండ్ వస్తుంది.

Viral video: తెలివా.. అతి తెలివా.. అద్దం ముందు ఈమె చేస్తున్న పని చూసి నెటిజన్లు షాక్..


సౌండ్ రావడంతో అక్కడ మట్టిని మరింత తవ్వి చూడగా.. ఓ చిన్న సంచి కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసి, లోపల ఏముందో చూసేందుకు తెరుస్తాడు. అయితే ఆశ్చర్యకరంగా లోపలి నుంచి ఓ పాము బయటికి వస్తుంది. సంచిలో నుంచి బయటికి వచ్చిన పాము రాళ్లల్లోకి వెళ్లిపోతుంది. పాము వెళ్లిపోగానే సంచిలో ఏముందో అని చూడగా.. చాలా బంగారు నాణేలు (Gold coins) బయటపడతాయి. సంచి మొత్తం చూడగా.. అందులో చాలా నాణేలు కనిపిస్తాయి.

Viral video: ఇదేం చాటింపురా నాయనా..! పెళ్లిసంబంధం వస్తోందని చెప్పి.. ఎలాంటి షరతు పెట్టాడంటే..


అయితే ఇదంతా వ్యూస్, లైక్‌ల కోసం కావాలని చేసినట్లు ఉన్నా కూడా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది నిజం కాకపోయినా చూసేందుకు ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి తప్పుడు సమాచారం వీడియోలు చేయకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: వధువును ముద్దు పెట్టుకున్న వరుడు.. ఆ వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్... ఏం జరిగిందని విచారించగా..

Updated Date - Jun 15 , 2024 | 03:51 PM

Advertising
Advertising