ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: యువకుడి వేలు పట్టుకున్న ఉడుత.. ఏంటా అని ఆశ్చర్యపోయేలోపే.. చివరకు అది చేసిన నిర్వాకం..

ABN, Publish Date - Jul 28 , 2024 | 08:03 PM

జంతువులు కొన్నిసార్లు మనుషులే ఆశ్చర్యపడేలా ప్రవర్తిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు మనుషులకు గుణపాఠం కలిగించే పనులు చేస్తుంటాయి. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే అయ్యో.. పాపం..! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి..

జంతువులు కొన్నిసార్లు మనుషులే ఆశ్చర్యపడేలా ప్రవర్తిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు మనుషులకు గుణపాఠం కలిగించే పనులు చేస్తుంటాయి. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే అయ్యో.. పాపం..! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఉడుత సడన్‌గా ఓ వ్యక్తి వేలు పట్టుకుని తీసుకెళ్లింది. చివరకు అది చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవువతోంది. రోడ్డు పైకి వచ్చిన ఓ ఉడుత (squirrel) అటూ ఇటూ చూసి చివరకు ఓ వ్యక్తి వద్దకు వెళ్లి, అతడి వేలు పట్టుకుంటుంది. దీంతో అతడితో పాటూ చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతా ఆశ్చర్యపోతుండగానే.. ఆ ఉడుత అతన్ని తన వెంట తీసుకెళ్తుంది. ఎక్కడి తీసుకెళ్తుందబ్బా.. అనుకుంటూ ఆ వ్యక్తి కూడా ఆసక్తిగా దాని వెంటే వెళ్తాడు.

Viral Video: ఎరను చూసి దగ్గరికొచ్చిన మొసలి.. సడన్‌గా వెనక్కు లాక్కోవడంతో.. చివరకు తిక్కరేగి..


కొంత దూరం తీసుకెళ్లగానే అతడి చేయి విడిచిపెట్టిన ఉడుత.. అక్కడే ఉన్న ఓ పెద్ద చెట్టు పైకి ఎక్కుతుంది. చివరకు చెట్టు మొదల్లో ఉన్న తొర్రలోకి వెళ్లిపోతుంది. లోపల చూస్తే చాలా ఉడుత పిల్లలు కనిపిస్తాయి. తన పిల్లలను చూపించాలని ఆ (Squirrel took the man to his children) ఉడుత అతన్ని తీసుకొచ్చినట్లు చివరకు అతడికి అర్థమవుతుంది. ఫైనల్‌గా ఉడుద పిల్లలను చేత్తో తడిమి చూసి అతను కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు.

Viral Video: రోడ్డుపైనే ప్రేమికుల సరసాలు.. ప్రేయసిని పక్కకు ఎత్తుకెళ్తుండగా.. చూస్తుండగానే ఒక్కసారిగా..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఉడుతను చూస్తుంటే.. ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఈ ఉడుతను చూస్తుంటే తెలుస్తోంది’’.. అంటూ మరికొందరు, విచిత్రంగా ప్రవర్తించే పక్షుల వీడియోలు పోస్టు చేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లల డాన్స్‌కు ఫిదా అయిన పావురం.. చివరకు ఏం చేసిందో చూడండి..

Updated Date - Jul 28 , 2024 | 08:03 PM

Advertising
Advertising
<