Viral video: నీళ్లలో నడుస్తుండగా షాకింగ్ సీన్.. రాయిలా మెరుస్తూ ఉండడంతో కాలితో తొక్కి చూడగా..

ABN, Publish Date - Jun 21 , 2024 | 08:04 PM

నదులు, సముద్రాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరికి వింత వింత వస్తువులు దర్శనమిస్తే.. మరికొన్ని విచిత్ర జీవులు కనిపిస్తుంటాయి. ఇలాంటి ..

Viral video: నీళ్లలో నడుస్తుండగా షాకింగ్ సీన్..  రాయిలా మెరుస్తూ ఉండడంతో కాలితో తొక్కి చూడగా..

నదులు, సముద్రాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరికి వింత వింత వస్తువులు దర్శనమిస్తే.. మరికొన్ని విచిత్ర జీవులు కనిపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, నది నీటిలో నడుస్తున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నీళ్లలో నడుస్తుండగా.. అందమైన రాయిలా కనిపించడంతో కాళ్లతో తొక్కాడు. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నది ఒడ్డున నీటిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అయితే మధ్యలో అతడికి ఎదురుగా మెరుస్తూ ఓ రాయి లాంటి ఆకారం మెరుస్తూ కనిపించింది. అదేంటో తెలుసుకోవాలని అతను దానిపై కాలు పెట్టి తొక్కి చూశాడు. కాలు మోపగానే కొంచెం మెత్తగా అనిపించడంతో మళ్లీ మళ్లీ కాలితో గట్టిగా తొక్కసాగాడు. ఇలా చాలా సార్లు కాలితో తొక్కగానే రాయి అనుకున్నది కాస్తా.. ఒక్కసారిగా అతడిపై దాడి చేస్తుంది.

Viral video: బస్సు కింద పడుకుని యువకుడి డేంజరస్ స్టంట్.. అసలు విషయం తెలుసుకుని మండిపడుతున్న నెటిజన్లు..


కాలిని గట్టిగా కొరకడంతో అతను కిందపడిపోయి నొప్పితో విల్లవిల్లాడిపోతాడు. నిశితంగా పరిశీలింగా.. అతడిపై దాడి చేసింది.. స్టింగ్రే ఫిష్ (Stingray Fish) అని తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇది చాలా ప్రమాదకరంలా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘2006లో ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తిని ఇలాంటి చేపలు చంపేశాయి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 71వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Love Story: స్నేహితుడు పిలిచాడని ఆస్పత్రికి వెళ్లాడు.. రాత్రికి రాత్రే అమ్మాయిగా మారాడు.. చివరకు..

Updated Date - Jun 21 , 2024 | 08:04 PM

Advertising
Advertising