ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఒడ్డున పడి కొట్టుమిట్టాడుతున్న చేప.. గమనించిన కొంగ.. సమీపానికి వెళ్లి..

ABN, Publish Date - Jun 30 , 2024 | 09:35 PM

కొంగల వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నదులు, చెరువుల్లో చేపలను ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. కొన్ని కొంగలు ఒంటి కాలిపై కదలకుండా నిలబడి.. సమీపానికి వచ్చే చేపలను ఇట్టే నోట కరచుకుంటుంటాయి. అయితే ..

కొంగల వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నదులు, చెరువుల్లో చేపలను ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. కొన్ని కొంగలు ఒంటి కాలిపై కదలకుండా నిలబడి.. సమీపానికి వచ్చే చేపలను ఇట్టే నోట కరచుకుంటుంటాయి. అయితే ఇలాంటి కొంగలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటంది. మీ ఊహకు కూడా అందడం లేదు కదా. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కొంగ ఇలాగే చేసింది. ఒడ్డున పడి కొట్టుమిట్టాడుతున్న చేప వద్దకు వెళ్లిన కొంగ.. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చేప చెరువు ఒడ్డున పడి కొట్టుమిట్టాడుతుంటుంది. నీటిలోకి వెళ్లే వీలు లేకపోవడంతో చాలా సేపు గిలగిలాకొట్టుకుంటూ ఉంటుంది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న కొంగ.. చేపను గమనిస్తుంది. మెల్లగా చేప వద్దకు వెళ్తుంది. చటుక్కున నోట్లో వేసుకుని మింగేస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ ఆ కొంగ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.

Viral: ముక్కులో ఊపిరాడక వైద్యుడి వద్దకు వెళ్లిన రోగి.. పరీక్షించి చూడగా.. చివరికి షాకింగ్ సీన్..


కొట్టుమిట్టాడుతున్న చేపను నోట కరుచుకుని (stork dropped the fish in the water) మళ్లీ నీటిలో పడేస్తుంది. చేపను చూడగానే తినేయాల్సిన కొంగ.. ఇలా ఈ చేపను చూడగానే తన మంచితనం చూపించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కొంగది ఎంత మంచి మనసు’’... అంటూ కొందరు, ‘‘ఇలాంటి కొంగను ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఒకే ఇంట్లో మూడోసారి చోరీకి వెళ్లిన దొంగ.. బెడ్రూంలో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు..

Updated Date - Jun 30 , 2024 | 09:35 PM

Advertising
Advertising