Viral: ఓర్నీ.. లీవ్‌లెటర్ ఇలా ఎవరైనా రాస్తారా? స్టూడెంట్ రాసిన లెటర్ చూసి అవాక్కైన టీచర్..
ABN , Publish Date - Sep 14 , 2024 | 01:05 PM
స్కూలుకు వెళ్లకుండా ఉండడానికి పిల్లలు రకరకాల సాకులు చెబుతుంటారు. ఆరోగ్యం బాగా లేదనో, మరొకటనో చెప్పి సెలవు పెడుతుంటారు. ఇక, టీచర్లకు రాసే లీవ్ లెటర్‌లో కూడా చాలా జాగ్రత్తగా కారణాలు రాస్తుంటారు. అయితే కొందరు పిల్లలు వెరైటీ కారణాలు చెప్పి సెలవులు పెడుతుంటారు.
స్కూలుకు వెళ్లకుండా ఉండడానికి పిల్లలు (Student) రకరకాల సాకులు చెబుతుంటారు. ఆరోగ్యం బాగా లేదనో, మరొకటనో చెప్పి సెలవు (Leave) పెడుతుంటారు. ఇక, టీచర్లకు రాసే లీవ్ లెటర్ (Leave Letter)లో కూడా చాలా జాగ్రత్తగా కారణాలు రాస్తుంటారు. అయితే కొందరు పిల్లలు వెరైటీ కారణాలు చెప్పి సెలవులు పెడుతుంటారు. అలాంటి లీవ్‌లెటర్‌లను చూసినపుడు టీచర్లు (Teacher) కూడా నవ్వకుండా ఉండలేరు. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ramdall అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో టీచర్‌కు ఓ స్టూడెంట్ రాసిన లీవ్ లెటర్ కనిపిస్తోంది. తనకు లీవ్ కావాలని కోరుతూ ఓ విద్యార్థి రాసిన లేఖ అది. గణేష్ చతుర్థి సందదర్భంగా తనకు 12 రోజుల సెలవు కావాలని ఓ విద్యార్థి కోరాడు. 11 రోజుల పాటు గణేష్ చతుర్థి కోసం సెలవు కావాలని రాస్తూ, విశ్రాంతి కోసం అదనంగా మరొక రోజు సెలవు కావాలని అడిగాడు. ఆ లెటర్‌లో ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నేరుగా సెలవు కావాలని ఉంది. ఆ లెటర్ చూసి అవాక్కైన టీచర్ దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫన్నీ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాదాపు 90 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``స్ట్రెయిట్ టాక్.. నో నాన్సెన్స్ ``, ``ఆ కుర్రాడి నిజాయితీకి హ్యాట్సాఫ్``, ``ఇదే బెస్ట్ లీవ్ అప్లికేషన్``, ``వెరీ ఫన్నీ``, ``నేను లీవ్ లెటర్‌లో ఎన్ని అబద్ధాలు రాసేవాడినో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న నెంబర్ ఎక్కడుందో కనుక్కోండి..
Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..
Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..
Picture Puzzle: మీ కళ్లకు స్పెషల్ టెస్ట్.. ఈ రెండు ఫొటోలోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..