ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: స్నేహమంటే ఇదేరా.. ఇద్దరూ కలిసి సైకిల్ ఎలా తొక్కుతున్నారో చూస్తే..

ABN, Publish Date - Dec 17 , 2024 | 12:21 PM

సోషల్ మీడియాలో విచిత్ర విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..

సోషల్ మీడియాలో విచిత్ర విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇద్దరు స్నేహితులు కలిసి సైకిల్ తొక్కడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కలిసి సైకిల్ తొక్కడం ఏంటీ.. ఆశ్చర్యపోతున్నారా.. ఈ వీడియో చూశారంటే మీరు కూడా అవాక్కవుతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు బాలురు కలిసి స్కూల్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. వారిలో ఓ బాలుడు యూనిఫామ్, బ్యాగు తగిలించుకుని తన సైకిల్‌పై బయటికి వచ్చాడు. అయితే రెండో బాలుడికి సైకిల్ లేకపోవడంతో ఇద్దరూ కలిసి ఒకే సైకిల్‌పై బయలుదేరారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఒకరు వెనుక కూర్చుని ఇంకొకరు సైకిల్ తొక్కడం నచ్చని ఆ స్నేహితులు.. ఆ కష్టాన్ని కూడా సగం సగం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

Viral Video: పక్కా స్కెచ్ అంటే ఇదే.. ఒడ్డున ఉన్న కుక్కపై మొసలి టార్గెట్.. ఇంతలో వెనుక నుంచి..


వారిద్దరూ సైకిల్‌కు రెండు వైపులా పెడల్‌పై రెండు కాళ్లను (Friends riding bicycle innovatively) పెట్టి తొక్కడం స్టార్ట్ చేశారు. అలాగే హ్యాండిల్‌ను కూడా పట్టుకుని ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్ తొక్కుతున్నారు. సైకిల్‌ను ఇలా విచిత్రంగా తొక్కుతున్న ఈ స్నేహితులను చూసి రోడ్డుపై వెళ్లే వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బైకులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: ఏనుగును రెచ్చగొడితే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ పర్యాటకులను ఏం చేసిందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు ఏమైనా చేయగలరు’’.. అంటూ కొందరు, ‘‘సైకిల్‌ను ఇలాక్కూడా తొక్కవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దుకాణంలో కొనేదంతా బంగారం కాదా..! చిన్న టెక్నిక్‌తో ఎలా పట్టేశాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 17 , 2024 | 12:21 PM