Viral: డాల్ఫిన్‌ను కాపాడిన మత్స్యకారులు.. నెట్టింట వీడియో వైరల్
ABN, Publish Date - Apr 20 , 2024 | 08:31 PM
ఇబ్బందుల్లో పడ్డ ఓ డాల్ఫిన్‌ను మత్స్యకారులు కాపాడిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుప్రియా సాహు షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇబ్బందుల్లో పడ్డ ఓ డాల్ఫిన్‌ను మత్స్యకారులు కాపాడిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుప్రియా సాహు షేర్ చేశారు. మూగజీవాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: పాములే లేని ఈ దేశం గురించి తెలుసా
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తమిళనాడుకు సమీపంలోని పాక్‌బే తీరం వద్ద చిక్కుకుపోయిన డాల్ఫిన్‌కు స్థానిక మత్స్యకారులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. డాల్ఫిన్‌ను పరిశీలించిన అటవీ శాఖ సిబ్బంది అది ఏదో ఇబ్బందుల్లో ఉందని భావించిన వారు దాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగారు. వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహాయం తీసుకుని డాల్ఫిన్‌కు పూర్తి స్వస్తత చేకూర్చారు. అనంతరం, దాన్ని మత్స్యకారుల సాయంతో మళ్లీ సముద్రంలోకి విడిచిపెట్టారు (TamilNadu Fishermen save stranded Dolphin).
ఈ దృశ్యాలను నెట్టింట పంచుకున్న అధికారి..డాల్ఫిన్ కాపాడటంలో సాయం చేసిన మత్స్యకారులకు ధన్యవాదాలు తెలిపారు. వృత్తిపై అత్యంత నిబద్ధతతో పనిచేసిన అటవీ శాఖ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 20 , 2024 | 08:44 PM