Viral: కోర్టునే ఆశ్చర్యపరిచిన ట్యాక్సీ డ్రైవర్! భార్యకు భరణం చెల్లించమంటే..
ABN, Publish Date - Dec 21 , 2024 | 10:31 PM
తమిళనాడుకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ఏకంగా న్యాయస్థానాన్నే ఆశ్చర్యపరిచాడు. విడాకుల కేసు తేలేవరకూ భార్యను అదుకునేందుకు మధ్యంతర భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తూ అతడు ఏకంగా కరెన్సీ నాణేల సంచిలతో కోర్టుకు వెళ్లాడు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడుకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ ఏకంగా న్యాయస్థానాన్నే ఆశ్చర్యపరిచాడు. విడాకుల కేసు తేలేవరకూ భార్యను అదుకునేందుకు మధ్యంతర భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తూ అతడు ఏకంగా కరెన్సీ నాణేల సంచిలతో కోర్టుకు వెళ్లాడు. ఇది చూసి న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. బుధవారం వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది (Viral).
Viral: భారత్‌లో టూర్ తరువాత తీవ్ర విమర్శలు గుప్పించిన బ్రిటీష్ పౌరుడు
స్థానిక మీడియా కథనాల ప్రకారం, సదరు ట్యాక్సీ డ్రైవర్ వాడవల్లీ ప్రాంతంలో నివసిస్తుంటారు. అతడి భార్య గతేడాది విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, తుదితీర్పు వెలువడే లోపు ఆమె పోషణ కోసం రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం తన కారు తీసుకుని అతడు కోర్టుకు వచ్చారు. తనతో పాటు నాణేలున్న 20 బ్యాగులను వెంట తెచ్చారు. వాటిల్లో కొన్నిటిని ఒక్కొక్కటిగా కోర్టు హాల్‌లోకి తీసుకొచ్చారు.
Viral: రైలు కిటికీ అద్దాలు పగలగొట్టిన ప్యాసెంజర్లు.. షాకింగ్ దృశ్యాలు వైరల్!
ఇది చూసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి నోట్ల రూపంలో డబ్బు చెల్లించాలంటూ ట్యాక్సీ డ్రైవర్‌ను తిప్పి పంపించారు. దీంతో, ఆయన బ్యాగులను తీసుకుని వెనక్కు మళ్లారు. ఆ తరువాత మరుసటి రోజు ఆయన రూ.80 వేల నగదుతో తిరిగి రావడంతో మిగితా మొత్తా్న్ని త్వరలో చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.
Viral: పార్లమెంటులో పొగతాగిన మహిళా ఎంపీ.. షాకింగ్ వీడియో వైరల్
కాగా, గతేదాడి రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన భార్యకు రూ.55 వేలను నాణేల రూపంలోనే చెల్లించాడు. అంతకుముందు అతడు 11 నెలలుగా భార్యకు భరణం చెల్లించకపోవడంతో న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో, అతడు మరుసటి రోజు రూ.1, రూ.2 నాణేలు ఉన్న బ్యాగులతో కోర్టుకు వచ్చాడు. అయితే, ఆ నాణేలను లెక్కించడమంటే మానసిక హింసేనని భార్య తరపు న్యాయవాది వాదించారు. దీంతో, కోర్టు ఆ నాణేలను భర్త కోర్టు హాలులో స్వయంగా లెక్కగట్టి ఇవ్వాలని, రూ.1000 విలువైన నాణేలు ఉన్న 55 బ్యాగులను తీసుకొచ్చి ఇవ్వాలని తీర్పు వెలువరించింది. దీంతో, ఈ ఉదంతం అప్పట్లో స్థానికంగా సంచలనానికి దారి తీసింది.
Viral: శోభనం రాత్రి వధువు కోరిక విని షాక్! పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు
Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!
Updated Date - Dec 21 , 2024 | 10:36 PM