ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ప్రపంచంలో అత్యంత ఎత్తైన వింత భవనం ఇదే.. దీన్ని చూశారంటే మతి పోవాల్సిందే..

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:07 AM

మనం రకరకాల ఆకారాల్లో భవనాలు చూసుంటాం. కొన్నికొన్ని నిర్మాణాలైతే చూసేందుకు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. కారు, ఫొటో, చెట్లు, జంతువులు సహా వివిధ ఆకృతుల్లో నిర్మాణాలు మనకు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఎన్నో రకాల వింతలు, విడ్డూరాలు మనం చూస్తుంటాం. కొంత మంది తమ అభిరుచులకు తగినట్లుగా నిరంతరం ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే అద్భుతాలను సృష్టిస్తుంటారు. ఇక నిర్మాణ రంగంలోనూ అలాంటివి ఎన్నో మనం చూశాం. ముఖ్యంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా దీనికి పేరుంది. వేలాది అపార్ట్‪మెంట్లు, చుట్టూ అద్దాలతో ఆకాశంలోకి దూసుకువెళ్లే రాకెట్‌లా కనిపిస్తుంది. అయితే తాజాగా ఫిలిప్పీన్స్ దేశంలోనూ అలాంటి విచిత్రమే ఒకటి జరిగింది.


మనం రకరకాల ఆకారాల్లో భవనాలు చూసుంటాం. కొన్నికొన్ని నిర్మాణాలైతే చూసేందుకు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. కారు, ఫొటో, చెట్లు, జంతువులు సహా వివిధ ఆకృతుల్లో నిర్మాణాలు మనకు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. అయితే ఈసారి మనం మాట్లాడుకోబోయే భవనం మాత్రం చాలా విచిత్రమైనది. అలాంది దాన్ని మీరు ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరు. ఫిలిప్పీన్స్ దేశంలో ఓ రిసార్ట్ యజమాని తన కలల భవనాన్ని నిర్మించి ఏకంగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


రికార్డో కానో గ్వాపో అనే వ్యక్తికి నీగ్రోస్ ఆక్సిడెంటల్‌ ప్రాంతంలో క్యాంపుస్టోహాన్ అనే విచిత్రమైన హైలాండ్ రిసార్ట్ ఉంది. అందులో పెద్ద రెస్టారెంట్, కేఫ్, మూడు స్విమ్మింగ్ పూల్స్, హోటల్ గదులు, బోనిటా గుడిసెలు, వందలాది డైనోసార్‌లు, కార్టూన్ బొమ్మలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆయన తన రిసార్టులో కోడి ఆకారంలో భవనం నిర్మించారు. ఇది ప్రపంచంలోనే కోడి ఆకృతిలో ఉన్న అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. 114.7 అడుగుల ఎత్తు (34.931 మీటర్లు)తో దీన్ని నిర్మించారు. అలాగే 39.9 అడుగుల వెడల్పు (12.127 మీటర్లు), 92.5 అడుగుల (28.172 మీటర్లు) పొడవుతో విచిత్రంగా తీర్చిదిద్దారు. ఈ భవనంలో మెుత్తం 15 గదులు ఉండగా.. ప్రతి గదికీ ఎయిర్ కండిషనర్లు, పెద్ద బెడ్‌లు, టీవీలు, షవర్లు అమర్చి అందంగా తయారు చేశారు.


ఈ భవనాన్ని జూన్ 10, 2023న ప్రారంభించి కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేశారు. కాగా, ఈ వింత భవనం ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ని సొంతం చేసుకుంది. కోడి ఆకారంలో భవనం నిర్మించడం తన కల అని రిసార్ట్ యజమాని రికార్డో కానో గ్వాపో తెలిపారు. తనకు ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండేదని, అందుకే తాను రిసార్ట్ ఏర్పాటు చేసి అందులో వింతవింత ఆకారాల్లో పలు నిర్మాణాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈసారి చేపట్టింది చాలా ప్రత్యేకమైనదని, దాని వల్ల తనకు, రిసార్టుకూ మంచి గుర్తింపు వచ్చిందని అంటున్నారు. దీన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 08 , 2024 | 11:14 AM