Anand Mahindra: కుక్క చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం! లైఫ్‌లో ఇలా ఎవరైనా చేస్తే..
ABN, Publish Date - Mar 18 , 2024 | 03:13 PM
మన్‌డే మోటివేషన్ పేరిట ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీడియోలో కుక్క తెలివికి అందరూ ఫిదా అవుతారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్ఫూర్తివంతమైన కథనాలు, వీడియోలను షేర్ చేస్తారన్న విషయం తెలిసిందే. నేడు ఆయన షేర్ చేసిన మరో వీడియో జనాలకు తెగ నచ్చేసింది. దీంతో, ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా నెట్టంట్లో ట్రెండింగ్‌లో (Viral Video) ఉంది.
Viral: ఇదేంటి తల్లీ.. నువ్వే ఇలా ఉంటే ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటో? నెట్టింట టీచర్ వీడియో వైరల్!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. ర్యాంప్‌పై నిలబడ్డ కొన్ని గొర్రెలు ఎటువెళ్లాలో తెలీక అలాగే నిలబడిపోయాయి. దీంతో, అక్కడ భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇది చూసిన ఓ కుక్క తెలివిగా సమస్యను పరిష్కరించింది. తొలుత అది గొర్రెలపై నుంచి దూకుతూ లైన్ ముందుకు వెళ్లింది. అక్కడి నుంచి అది వాటికి దారి చూపించడంతో అవన్నీ ఆ కుక్కనే ఫాలో అయిపోతూ ముందుకు సాగాయి. ర్యాంప్‌పై చూస్తుండగానే ట్రాఫిక్ జాం క్లియర్ అయిపోయింది. మిగతా వాటికి ముందుకు వెళ్లేందుకు అవకాశం చిక్కింది (Dog leads sheep ater the lauch)
Viral: ఈగకు ట్రెయినింగ్ ఇచ్చాడట.. ఇది ఎలాంటి పనులు చేస్తోందో చూడండి! నమ్మశక్యం కానీ సీన్!
ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మనం కొత్త దారి చేసుకుని ముందుకు సాగితే జనాలు వారంతట వారే మనల్ని ఫాలో అయిపోతారని అన్నారు. ఎవరినీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
జనాలకు ఈ వీడియో చాలా బాగా నచ్చడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. అనేక మంది ఆనంద్ మహీంద్రా సూచనతో ఏకీభవించారు. ఏటికి ఎదురీదడానికి భయపడొద్దని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించాలని అన్నారు. దారి తెలీక ఇరుక్కుపోయిన వారికి మార్గదర్శకత్వం చేయడమే నిజమైన నాయకత్వమని చెప్పారు.
కాగా గతనెలలో ఆనంద్ మహీంద్రా షేర్ చేసి వీడియో కూడా నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. వీడియోలో ఓ నిర్మాణకార్మికుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తన విధులు నిర్వర్తించారు. అకాశహర్మ్యం పై అంతస్తు వరకూ వెళ్లి అక్కడో చిన్న ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా తనకు సవాళ్లు ఎదురైనప్పుడల్లా ఇదే వీడియో చూసి స్ఫూర్తి పొందుతానన్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 18 , 2024 | 03:17 PM