ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral 8 ఏళ్ల పాటు మనుషులతో సావాసం.. రొట్టెలు చేయడం చేర్చిన కోతి!

ABN, Publish Date - Dec 31 , 2024 | 03:56 PM

8 ఏళ్లుగా ఓ కుటుంబంతో కలిసి ఉంటున్న కోతి వారికి ఇంటి పనుల్లో చేదోడువాదోడుగా ఉంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆరు నెలలు కలిసుంటే వారు వీరవుతారని ఓ సామేత. కానీ ఓ కోతి ఏకంగా 8 ఏళ్ల పాటు మనుషుల మధ్య గడిపింది. చివరకు రొట్టెలు చేయడం, అంట్లుతోమడం వంటి ఇంటి పనులన్నీ నేర్చింది. ఈ మేరకు ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఇదంతా నిజమేనా అని జనాలు నోరెళ్లబెడుతున్నారు. యూపీలోని రాయ్‌బరేలీ ఈ ఘటన వెలుగు చూసినట్టు తెలుస్తోంది (Viral).

సాద్వా గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఇంట్లో ఈ కోతి ఉంటోంది. దీని పేరు రాణి. తనను రాణి అని పిలిస్తేనే ఆ కోతికి నచ్చుతుంది. ఎవరైనా కోతి అంటే మాత్రం అస్సలు సహించదు. విశ్వనాథ్ కుటుంబంలో ఓ సభ్యురాలిగా మారిపోయిన రాణి వారితో పాటే భోజనం చేస్తుంది. వంట చేయడంలో సహాయపడుతుంది. చివరకు అంట్లు కూడా తోమి పెడుతుంది.

Viral: అమెజాన్‌లో రూ.కోటి జీతంతో జాబ్.. రిజైన్ చేసి మరీ సొంత సంస్థ పెడితే..


సుమారు ఏనిమిదేళ్ల క్రితం రాణి విశ్వనాథ్ కుటుంబంలో చేరింది. అప్పటికి రాణి పిల్ల కోతి. ఏదో కారణంగా తన మంద నుంచి తప్పిపోయింది. బిక్కు బిక్కు మంటూ ఉన్న రాణికి విశ్వనాథ్ భార్య ఆపన్నహస్తం అందించింది. తన మందకు దూరమైనందుకు మొదట్లో దిగాలుగా గడిపే రాణి ఆ తరువాత క్రమంగా తన చుట్టూ ఉన్న మనుషులకు అలవాటు పడిపోయిందని విశ్వనాథ్ కుమారుడు ఆకాశ్ తెలిపాడు. అతడే చాలా కాలంగా రాణి బాగోగులు చూసుకుంటున్నాడు.

Viral: పబ్‌లో నూతన సంవత్సర వేడుకలు.. అతిథులకు కండోమ్స్‌ గిఫ్ట్‌గా పంపి ఆహ్వానాలు!


ఇలా ఏళ్లతరబడి మనుషుల మధ్య సంచరించిన ఆ కోతి చివరకు మనుషుల తీరులోకి వచ్చేసిందట. ఇంట్లో వంట చేసుకొనేటప్పుడు చపాతీలు ఒత్తి పెడుతుంది. అంట్లు కూడా తోముతుంది. కుటుంబసభ్యులతో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు కూడా చూస్తుంటుంది. కోతి వీడియోలను ఆకాశ్ తరచూ తన యూట్యూబ్ ఛానల్‌లో పంచుకుంటూ ఉంటాడు. వాటికి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయని చెప్పాడు. కోతి చర్యలు చూసి వీక్షకులు ఆశ్చర్యపోతుంటారని కూడా తెలిపాడు.

ఓసారి రాణి ఇతర కోతులతో కలిసి వెళ్లిపోయిందుకు ప్రయత్నించిందట. కానీ కోతుల మంద రాణిని దూరంపెట్టడంతో మళ్లీ తిరిగొచ్చేసిందని కూడా ఆకాశ్ పేర్కొన్నాడు. స్థానికులను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్న దీనికి పనిమంతురాలైన కోతిగా పేరు స్థిరపడిందట. తమ మధ్య బంధం గాఢమైనదని విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. తమను కోతి పూర్తిగా అర్థం చేసుకుందని చెప్పుకొచ్చారు.

Read Latest and Viral News

Updated Date - Dec 31 , 2024 | 04:01 PM