ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: మనిషి రక్తానికి రెండు చుక్కల పాము విషం కలపగానే.. షాకింగ్ వీడియో!

ABN, Publish Date - May 13 , 2024 | 09:05 PM

మనిషి రక్తానికి రెండు చుక్కల పాము విషం కలపగానే అది గడ్డకట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: పాము కాటు తరువాత మనిషి రక్తానికి ఏమవుతుంది? ఇది చాలా మందిలో కలిగే ప్రశ్న. దీనికి సమాధానం ఇదే అంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (viral) మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు వ్యక్తులు పాము నుంచి విషాన్ని సేకరించారు. ఆ తరువాత మరో చిన్న గ్లాసులో కొంత మనిషి రక్తాన్ని తీసుకున్నారు. దానికి సరిగ్గా రెండు మూడు చుక్కల పాము విషయాన్ని జత చేశారు. ఆ తరువాత కాసేపటికే మనిషి రక్తం గడ్డకట్టుకుపోయింది.

ఇలా రక్తం గడ్డకట్టిపోవడం వల్లే మరణాలు సంభిస్తాయని వీడియోలో చెప్పారు. ఇలా శరీరంలో ఏర్పడే క్లాట్స్ (గడ్డకట్టిన రక్తం) కారణంగా వివిధ భాగాలకు రక్త సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. గుండె, ఊపిరితిత్తులు, ఇతర కీలక అవయవాలకు రక్త సరఫరా నిలిచిపోతే మరణం సంభవిస్తుందని తెలిపారు (Video Shows What Happens To Human Blood After Snakebite).

Viral: పెళ్లిలో ఈ వధువు డ్యాన్స్ చూస్తే.. వరుడిలో కొత్త ఊపు!


పాము కాటుకు చికిత్స ఏంటి అంటే యాటీ వీనమ్ అని వైద్యులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఇది పాము విషయం నుంచి మనిషిని రక్షిస్తుందని అంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. యాంటీ వీనమ్ కూడా పాము విషంతోనే తయారు చేస్తారు. ఇందుకోసం తొలుత పాము విషం తన ప్రభావం కోల్పోయేంతగా డైల్యూట్ చేసి (పలుచగా మార్చి) గొర్రెలు లేదా గుర్రాల్లోకి ఎక్కిస్తారు. ఫలితంగా వాటి శరీరంలో, పాము విషాన్ని నిర్వీర్యం చేసే యాంటీబాడీలు తయారవుతాయి. ఆ తరువాత ఈ యాంటీబాడీలను వాటి రక్తం నుంచి వేరు చేసి యాంటీవీనమ్ రెడీ చేస్తారు. యాంటీవీనమ్ లోని ఈ యాంటీబాడీలు మనిషి రక్తంలోని విషాన్ని నిర్వీర్యం చేస్తాయి.

Read Viral and Telugu News

Updated Date - May 13 , 2024 | 09:11 PM

Advertising
Advertising