ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: తెలివితక్కువ పులిని ఎప్పుడైనా చూశారా.. నీటిలో పాము అనుకుని చివరకు అది చేసిన నిర్వాకం..

ABN, Publish Date - Jul 09 , 2024 | 04:21 PM

పులుల వేట ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి వేటను టార్గె్ట్ చేశాయంటే.. ఇక వాటి దాడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. అంతటి పులులు కూడా కొన్నిసార్లు..

పులుల వేట ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి వేటను టార్గె్ట్ చేశాయంటే.. ఇక వాటి దాడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. అంతటి పులులు కూడా కొన్నిసార్లు తెలివి తక్కువగా ఆలోచిస్తాయా.. అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. నీటిలో పాము అనుకుని అది చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో వేట కోసం ఎదురు చూస్తున్న పులి (Tiger) .. చివరకు ఓ చెరువు (Pond) వద్దకు వెళ్తుంది. నీటిలో దిగి అక్కడేమైనా కనపడతాయేమో అని చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి మూతికి పాములా ఏదో తాకుతుంది. దీంతో పులి కూడా దాన్ని పాము అనుకుని వెంటనే తన నోటితో దాన్ని గట్టిగా పట్టుకుంటుంది.

Viral Video: పులి మీద పడుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


నోటికి చిక్కిన దాన్ని నీటిలోంచి బయటికి తీసుకొచ్చి తినేయాలని పులి అనుకుంటుంది. ఈ క్రమంలో నీటి ఒడ్డుకు రాగా షాకింగ్ సీన్ కనిపిస్తుంది. తన తోకను పాముగా భావించి నోటితో పట్టుకుందని (tiger biting its tail) తెలుసుకుని అక్కడున్న పర్యాటకులంతా అవాక్కయ్యారు. తోకను నోటితో పట్టకున్న పులి అప్పటికీ అసలు విషయం గుర్తించకుండా చాలా సేపు గింగిరాలు తిరుగుతూ నీటి ఒడ్డుకు వస్తుంది. తన తోకను తానే లాగే ప్రయత్నం చేయడంతో తన చుట్టూ తానే తిరుగుతూ చివరకు ఒడ్డుకు వచ్చేస్తుంది.

Viral Video: బట్టలు ఆరబెట్టేందుకు.. బకెట్‌‌తో ఈమె చేసిన ప్రయోగం మామూలుగా లేదుగా..


ఫైనల్‌గా అది పాము కాదు.. తన తోకే అనే విషయం తెలుసుకుని అవాక్కవుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఇది మామూలు కామెడీ కాదు’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా అమాయకమైన పులిలా ఉందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..

Updated Date - Jul 09 , 2024 | 04:21 PM

Advertising
Advertising
<