Viral: బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు.. యువ ఉద్యోగి ఆవేదన
ABN, Publish Date - Dec 31 , 2024 | 10:32 AM
బాస్ తనను అనకూడని మాటలు అంటున్నారంటూ ఓ 21 ఏళ్ల యువకుడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. అలాంటి వాళ్లను నిలబెట్టి దుమ్ముదులిపితేనే అదుపులో ఉంటారని నెటిజన్లు అతడికి సలహా ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులు భరింపరాని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ యువ ఉద్యోగి నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. బాస్ తనను అనకూడని మాటలు అంటున్నాడంటూ అతడు పెట్టిన పోస్టు అనేక మందిని కలిచివేసింది. రెడిట్‌లో అతడు ఈ పోస్టు పెట్టాడు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో చెప్పాలంటూ నెటిజన్ల సలహా కోరాడు (Viral).
ఇండియన్ వర్క్‌ప్లేస్ కమ్యూనిటీలో అతడు తన ఇబ్బందుల గురించి పంచుకున్నాడు. ‘‘నా వయసు 21. ఇటీవల కాలేజీ చదువు పూర్తి చేశా. ఉద్యోగానుభవం కోసం ఓ కార్పొరేట్ కంపెనీలో చేరా. ఇంటర్న్‌గా చేస్తున్నా. ఇది నాకు కొత్త రంగం అస్సలు అనుభవం లేదు. కానీ మా బాస్ మాత్రం నన్ను నానా మాటలు అంటున్నాడు. చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపుతూ నలుగురిలో నిలబెట్టి అనుకూడని మాటలు అంటున్నాడు. తాను రెండు దశాబ్దాల క్రితం చేసిన పనిని నా వల్ల మళ్లీ చేయాల్సి వస్తోందని చెబుతున్నాడు. అతడి తీరును నేను భరించలేకపోతున్నా’’
Viral: ప్రపంచంలోని ఒకే ఒక 10 స్టార్ హోటల్! రూమ్ రెంట్ ఒక్క రాత్రికి రూ.10 లక్షలు!
‘‘వాస్తవానికి నాకు విదేశాల్లో ఓ కాలేజీలో సీటు వచ్చింది. మరింత మంచి కాలేజీలో సీటు కోసం ఉద్యోగానుభవం సంపాదించాలనుకున్నా. కావాలనుకుంటే నేను ఇంటికి వెళ్లిపోవచ్చు. నా తల్లిదండ్రులు స్థితిమంతులే. కానీ నేను తిరిగివెళితే వారు నా ఉద్యోగజీవితం సరిగా లేదనుకుని బాధపడతారు. వారిని నిరాశ పరచడం నాకు ఇష్టం లేదు. కానీ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలీట్లేదు’’ అని చెప్పుకొచ్చాడు.
Viral: ఇదేమీ నూతన సంవత్సర వేడుకలు దేవుడా! రోడ్డుపై పెట్రోల్ పోసి..
దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. బాస్ రాచిరంపాన పెట్టడం అస్సలు సబబు కాదని నెటిజన్లు అన్నారు. వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ‘‘హెచ్‌ఆర్‌కు కంప్లెయింట్ చేయాలి. వారు వినకపోతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వారూ వినకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ఓ వ్యక్తి సలహా ఇచ్చారు. ‘‘ఈ మానసిక వేదనను మౌనంగా భరించాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘మౌనంగా ఉంటే ఇలాంటి వాళ్లు మరింతగా రెచ్చిపోతారు. అప్పటికప్పుడే అతడికి దీటుగా జవాబివ్వాలి. జాబ్ కోసమో, ప్రమోషన్ కోసమో లేదా ఇంక్రిమెంట్ కోసమో భరించనక్కర్లేదు. కొత్త జాబ్ మహా అయితే రెండు మూడు నెలల్లో దొరుకుతుంది’’ అని సలహా ఇచ్చారు.
Updated Date - Dec 31 , 2024 | 10:39 AM