ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పోట్లాడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన ఎద్దులు.. అప్పుడే దూసుకొచ్చిన రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN, Publish Date - Jul 06 , 2024 | 04:09 PM

రైలు పట్టాలపై షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషుల కారణంగా రైళ్లకు ఆటకం కలిగితే.. మరికొన్నిసార్లు జంతువుల కారణంగా ఇబ్బంది జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు...

రైలు పట్టాలపై షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషుల కారణంగా రైళ్లకు ఆటకం కలిగితే.. మరికొన్నిసార్లు జంతువుల కారణంగా ఇబ్బంది జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ రైలు పట్టాలపైకి వెళ్లాయి. అదే సమయంలో రైలు అటుగా దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ... సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు గేటు సమీపంలో రెండు ఎద్దుల మధ్య ఉన్నట్టుండి పోట్లాట మొదలవుతుంది. రెండు ఎద్దులూ (Fighting bulls) కొమ్ములతో ఢీకొంటూ అటూ, ఇటూ తోసుకుంటుంటాయి. వీటి గొడవ చూసి తమ మీద ఎక్కడ పడతాయో అని అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు.

Viral Video: వర్షంలో మేడపైకి వెళ్లిన ప్రేమికులు.. ఎవరూ చూడలేదనుకుని..


పోట్లాడుకుంటున్న ఎద్దులు చివరకు అక్కడే ఉన్న రైలు గేటు (Railway tracks) దాటి పట్టాలపైకి వెళ్లాయి. అదే సమయంలో ఓ రైలు అటుగా వచ్చింది. అయితే ఎద్దులు పోట్లాడుకోవడం చూసిన రైలు డ్రైవర్.. వేగాన్ని తగ్గించాడు. మెల్లగా వచ్చి ఎద్దుల వద్ద సడన్‌గా నిలిపేశాడు. ఎంత సేపు వేచి చూసినా ఎద్దులు మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా పోట్లాడుకుంటూనే ఉన్నాయి. దీంతో పక్కన ఉన్న వారు అక్కడికి వెళ్లి ఎద్దులను తరిమికొట్టేందుకు వాటిపై నీళ్లు పోస్తారు.

Viral Video: జలపాతం వద్ద యువకుడికి షాకింగ్ అనుభవం.. కంగారుగా బయటికి వచ్చి ప్యాంట్‌లో చూసుకోగా..


ఇలా చివరకు ఎలాగోలా ఆ ఎద్దులను అక్కడి నుంచి పక్కకు పంపించేస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైలునే ఆపేసిన ఎద్దులు’’.. అంటూ కొందరు, ‘‘రైలు డ్రైవర్ ఎంతొ మంచివాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లాడు ఆడుకుంటుండగా.. ఇంట్లోకి దూరిన పాము.. చివరకు బుడ్డోడు చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Jul 06 , 2024 | 04:09 PM

Advertising
Advertising
<