ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: నిజంగానే చాలా బాగుంది సర్.. మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు చురకలు..

ABN, Publish Date - Feb 20 , 2024 | 03:05 PM

వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.

వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫుడ్ గురించి. సీటు బుకింగ్ తో పాటే ఆహారాన్నీ బుక్ చేసుకునే సదుపాయాన్ని అధికారులు తీసుకువచ్చారు. దీంతో ఖరీదు ఎక్కువైనా చాలా మంది త్వరగా గమ్యస్థానానికి చేరుకుంటామనే ఉద్దేశ్యంతో వందే భారత్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఆహారాన్ని వండుకోలేని వాళ్లు ట్రైన్ లోని ఫుడ్ ను ప్రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

వందే భారత్ రైలులో ప్రయాణం చేస్తున్న కపిల్ అనే వ్యక్తి అదే రైలులో చిక్ పీస్ భోజనం ఆర్డర్ పెట్టుకున్నాడు. సిబ్బంది అతనికి ఆహారం అందించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే ఆకలితో ఉన్న కపిల్ చిక్ పీస్ తినేందుకు ప్యాకెట్ తెరిచాడు. అందులో కనిపించిన దృశ్యాలు చూసి అవాక్కయ్యాడు. ముందు చాలా కోపం తెచ్చుకున్న అతను కొంత సమయం తర్వాత శాంతించాడు. ఆ ఫుడ్ ఫొటో తీసి కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను ట్యాగ్ చేస్తూ వ్యంగ్యంగా క్యాప్షన్ రాశారు.


"వందే భారత్ రైలులో నూనె, మిర్చి, మసాలా లేని ఆరోగ్యకమైన ఫుడ్ ను అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు" అని కపిల్ తన ట్వీట్‌లో రాశారు. ఫిబ్రవరి 19 న ఈ ట్వీట్ పోస్ట్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 2.1 మిలియన్లకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. పానీపూరీని నీటిలో ఉడికించారని, రసగుల్లా అనుకున్నాను. కానీ జూమ్ చేసినప్పుడు చోళే అని గమనించాను అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 04:18 PM

Advertising
Advertising