Share News

Optical illusion: ఇక్కడున్న వందలాది రొట్టెల మధ్య పిల్లి దాక్కుని ఉంది.. 7 సెకన్లలో కనిపెట్టగలరేమో ట్రై చేయండి..

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:49 PM

ఫజిల్స్ పరిష్కరిచండం వల్ల మెదడు షార్ప్‌గా ఉండడంతో పాటూ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అయితే కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు, వీడియోలు.. మెదడుకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. వాటిలో...

Optical illusion: ఇక్కడున్న వందలాది రొట్టెల మధ్య పిల్లి దాక్కుని ఉంది.. 7 సెకన్లలో కనిపెట్టగలరేమో ట్రై చేయండి..

ఫజిల్స్ పరిష్కరిచండం వల్ల మెదడు షార్ప్‌గా ఉండడంతో పాటూ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అయితే కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు, వీడియోలు.. మెదడుకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. వాటిలో పైకి కనిపించే దృశ్యం ఒకటైతే.. దాన్ని తీక్షణంగా గమనిస్తే మరో దృశ్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వందలాది రొట్టెలు నేలపై పడి ఉన్నాయి. అయితే వాటి మధ్యలో ఓ పిల్లి కూడా దాక్కుని ఉంది. దాన్ని కనుక్కోవడం మాత్రం అంత ఈజీ ఏమీ కాదండోయ్.. కానీ కాస్త తీక్షణంగా గమనిస్తే పెద్ద కష్టం కూడా కాదు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion photo) తెగ వైరల్ అవుతోంది. అందులో నేలపై వందలాది రొట్టెలు కుప్పులుగా పడి ఉన్నాయి. అయితే వాటి మధ్యలో (cat hiding in the bread) ఓ పిల్లి దాక్కుని ఉంది. ఎవరూ లేని సమయం చూసి రొట్టెలను తినేయాలని ప్లాన్ చేస్తూ ఉంది. దాన్ని ముందే పసిగట్టి చెప్పగలిగితే మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం. ఇంకెందుకు ఆలస్యం ఆ పిల్లి ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రై చేయండి. 7సెకన్లలో కనిపెడితే మాత్రం మీకు ఎంతో ఏకాగ్రత్త ఉన్నట్లు లెక్క. ఒకవేళ మీరు గుర్తుపట్టలేకపోయినా సమస్య లేదు.. ఈ క్రింద ఇచ్చిన ఫొటో చూసి పిల్లిని పసిగట్టవచ్చు.

cat-Optical-illusion.jpg

Optical illusion: ఈ కొండల్లో చిరుత పులి ఎక్కడుందో పది సెకన్లలో గుర్తించగలరా..

Updated Date - Jan 21 , 2024 | 05:50 PM