ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: అరచేతి సైజు కూడా లేని ఈ తాబేలు.. అంతపెద్ద సింహాన్ని సైతం..

ABN, Publish Date - Jun 16 , 2024 | 06:32 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాహం వేసిన ఓ సింహం .. చెరువు ఒడ్డుకు వెళ్లి తాపీగా నీళ్లు తాగుతుంటుంది. అదే స్థలంలో ఉన్న ఓ చిన్న తాబేలు .. సింహం నీళ్లు తాగడాన్ని గమనిస్తుంది. వెంటనే..

చిన్న చిన్న జీవులే కదా అని చిన్నచూపు చూస్తే.. చివరకు ఎవరికైనా పెద్ద పెద్ద షాక్‌లు తగలడం ఖాయం. చూసేందుకు చీమ చిన్నదే అయినా పామును సైతం ముప్పుతిప్పలు పెట్టగలదు. అలాగే ఈగే కాదా తక్కువ అంచనా వేస్తే.. చెవిలోకి దూరి చుక్కలు చూపించగలదు. ఇలా అనేక చిన్న జీవులు పెద్ద పెద్ద జంతువులను ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటాం. ఇందుకు నిదర్శనంగా మన కళ్లముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అరచేతి సైజు కూడా లేని ఓ తాబేలు ఏకంగా సింహానికే చుక్కలు చూపించింది. తన ప్లేస్‌లో నీళ్లు తాగుతున్న సింహాన్ని చూసి ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. దాహం వేసిన ఓ సింహం (lion) .. చెరువు ఒడ్డుకు వెళ్లి తాపీగా నీళ్లు తాగుతుంటుంది. అదే స్థలంలో ఉన్న ఓ చిన్న తాబేలు (turtle) .. సింహం నీళ్లు తాగడాన్ని గమనిస్తుంది. వెంటనే దాని వద్దకు వెళ్లి.. ‘‘ఎంత సింహానివైతే మాత్రం.. నా పర్మిషన్ లేకుండా.. ఏకంగా నా ప్లేస్‌లోకి వచ్చి నీళ్లు తాగుతావా.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో’’.. అన్నట్లుగా సింహం మూతి వద్దకు వెళ్లి నీళ్లు తాగకుండా అడ్డుకుంటుంది. తాబేలు నిర్వాకానికి అవాక్కైన సింహం.. తల పక్కకు తిప్పి ఆ పక్కనే నీళ్లు తాగేందుకు ప్రయత్నిస్తుంది.

Viral video: మసాజ్ చేస్తున్న సమయంలో.. కస్టమర్ కళ్లు మూసుకోగానే.. ఇతడు చేసిన నిర్వాకం..


అయినా తాబేలు మాత్రం వెనక్కు తగ్గకుండా సింహాన్ని విసిగిస్తూనే ఉంటుంది. దీంతో చివరకు అంతపెద్ద సింహం కూడా భయంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ తాబేలు డేరింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహానికి చుక్కలు చూపించిన తాబేలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 16 , 2024 | 06:32 PM

Advertising
Advertising