Viral: ఇదేం ఐడియారా బాబూ! రోడ్డుపై గాల్లో తేలుతున్నట్టు ఇల్లు కడుతున్నారుగా!
ABN , Publish Date - Nov 26 , 2024 | 09:42 PM
రోడ్డుపై ఇరువైపులా గోడలు నిర్మించి వాటిపై సుమారు 15 అడుగుల ఎత్తున ఓ రెండస్తుల భవనం నిర్మిస్తున్న తీరు ప్రస్తుతం జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తనకంటూ ఓ ఇల్లు సమకూర్చుకోవాలనేది సగటు మధ్యతరగతి వ్యక్తి కల. కానీ ఈ కలసాకారం చేసుకోవడం అంత ఈజీ కాదు. నచ్చిన చోట, సరసమైన ధరకు ఇల్లు కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఫలితంగా అనేక మంది నగరాలకు దూరంగా ఇళ్లో, ఖాళీ జాగానో సమకూర్చుకుని సంతృప్తి చెందుతారు. నగరాల మీద ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా ఈ తరహా సబ్‌అర్బన్ వెంచర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. అయితే, ఓ చోట మాత్రం ఇల్లు ఏకంగా ‘రోడ్డుపైనే’ కట్టడం మొదలెట్టారు. ఇది చూసి జనాలు షాకైపోవడంతో ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో (Viral) కొనసాగుతోంది.
Viral: పెళ్లి వేదిక మీదే వరుడితో వధువు తెగదెంపులు! కారణం తెలిస్తే..
ఈ ఇల్లు ఎక్కడ కడుతున్నదీ తెలియరానప్పటికీ జనాలను మాత్రం ఈ వీడియో బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రోడ్డుకు ఇరువైపులా రెండు గోడలు నిర్మించి దానిపై రెండు అంతస్తుల ఇల్లు నిర్మిస్తున్నారు. రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లగలిగేలా ఎటువంటి అడ్డంకులు లేకుండా చాలా పైన తేలియాడుతున్నట్టు ఈ ఇల్లు నిర్మిస్తున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు వీలుగా రోడ్డుకు ఓ వైపున మెట్లు కూడా ఏర్పాటు చేశారు.
Viral: తొలిసారి గులాబ్ జామూన్ ట్రై చేసిన కొరియా యువతి! ఆమె రియాక్షన్ చూస్తే..
వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఏ గ్రామంలో ఇలాంటి ఇంటిని నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఇంటికి అనుమతులు ఎలా వచ్చాయో అని మరికొందరు ఆశ్చర్యపోయారు. ఇల్లు కట్టుకునే జాగా దొరక్క ఇలాంటి ప్లాన్ చేశారా? చిన్న జాగా కూడా లేని నగరాల్లో భవిష్యత్తు నిర్మాణాలన్నీ ఇలాగే ఉండబోతున్నాయేమో అని కొందరు కామెంట్ చేశారు. ఈ ఇల్లు సురక్షితమేనా అని కొందరు ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది. జనాలు నివ్వెరపోయేలా చేస్తోంది. మరీ ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
కాగా, కేవలం ఆరు అడుగుల వెడల్పున్న ఓ జాగాలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూడా ఇటీవల వైరల్ అయ్యింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న ఈ ఇంటిని స్థానికులు భారతీయ బుర్జ్ ఖలీఫా అని నామకరణం కూడా చేశారు. ఇంట్లో బెడ్‌రూం, బాత్‌రూం సహా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కొసమెరుపు. అయితే, నెటిజన్లు మాత్రం ఈ ఇల్లు అంత భద్రమైదని కాదని హెచ్చరించారు. చిన్న భూకంపం సంభవించినా ఇల్లు మొత్తం పేకమేడలా కూలిపోతుందని హెచ్చరించారు.
Viral: త్రేన్పులు రాని, అపానవాయువు వదలని వరుడు కావాలంటూ పేపర్లో యాడ్!