ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఒకే ట్రిప్‌కు రెండు ఫోన్లలో వేర్వేరు చార్జీల ఆరోపణ.. స్పందించిన ఉబర్

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:57 PM

ఒకే ట్రిప్‌కు రెండు ఫోన్లలో వేర్వేలు చార్జీలు కనిపిస్తున్నాయంటూ ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఒకే ట్రిప్‌కు రెండు ఫోన్లలో వేర్వేలు చార్జీలు కనిపిస్తున్నాయంటూ ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై అనేక మంది స్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అన్నారు. దీంతో, ఈ పోస్టుపై ఉబర్ కూడా స్పందించి వివరణ ఇచ్చింది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: పెంపుడు కుక్కను రక్షించేందుకు ప్రాణాలకు తెగించిన యజమాని! షాకింగ్ వీడియో!


సుధీర్ అనే నెటిజన్ ఉబర్ యాప్‌లో తనకెదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నారు. ‘‘ఒకే పికప్‌ పాయింట్, ఒకే గమ్యస్థానం, జర్నీ టైమ్ కూడా ఒకటే.. అయినా ఈ ట్రిప్‌కు రెండు వేర్వేరు ఫోన్లలో రెండు చార్జీలు కనిపిస్తున్నాయి. నాకు ఇదే అనుభవం ఎదురవుతుండటంతో తక్కువ రేటు కనిపించే నా కూతురి ఫోన్లోంచి క్యాబ్ బుక్ చేస్తూ ఉంటాను. మీకూ ఇలాగే జరుగుతుందా? అసలేం జరుగుతోంది?’’ అని నెట్టింట ఆయన ప్రశ్నించారు. రెండు వేర్వేరు ధరలు చూపిస్తున్న ఫోన్ల స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు.

ఈ పోస్టు వైరల్ కావడంతో ఉబర్ సపోర్టు స్పందించింది. సుధీర్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ‘‘హాయ్.. రెండు రైడ్ల ధరల్లో తేడాలకు కొన్ని కారణాలు ఉన్నాయి. పికప్ పాయింట్, గమ్యం చేరుకునే సమయం, డ్రాప్ ఆఫ్ పాయింట్లల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఫలితంగా ధరలలో తేడాలు కనిపించే అవకాశం ఉంది. వ్యక్తుల ఫోన్లు ఆధారంగా ధరలు నిర్ణయించడం జరగదు’’ అని హామీ ఇచ్చింది.

Viral: ప్రయాణికుడి ఫస్ట్ క్లాస్ సీటును ఓ కుక్కకు కేటాయించిన ఎయిర్‌లైన్స్!


మరోవైపు ఈ పోస్టుపై నెటిజన్లు అనేక మంది స్పందించారు. ‘‘అవును.. నాకు ఈ అనుభవం ఎదురైంది. కొన్ని సార్లు ధరల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండదు. మరికొన్ని సార్లు ఈ తేడా రూ.30 నుంచి రూ.50 వరకూ ఉంటుంది. మీ పర్సుతో గేమ్స్ ఎలా ఆడాలో ఈ టెక్నాలజీకి తెలుసు’’ అంటూ ఓ వ్యక్తి చమత్కరించారు. ‘‘దీనికి ఆల్గోరిథమ్ కారణం. మీరు ఒక రూట్‌లో పదే పదే జర్నీ చేస్తారని ఆర్గోరిథమ్‌కు అర్థమైతే వెంటనే ధరలు పెరుగుతాయి. అందుకే, ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌లో వెతకాలని నేను చెబుతుంటా’’ అని మరో వ్యక్తి అన్నారు. తనకూ ఇంచుమించు ఇలాంటి అనుభవమే ఎదురైంది ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. ‘‘సాధారణంగా యాప్ ఎక్కువగా వాడితే రేట్లు క్రమంగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. కొత్త క్లైంట్లను ఆఫర్‌లతో ఆకట్టుకునే బదులు పాత కస్టమర్లను తక్కువ రేట్లతో ప్రోత్సహిస్తూ పలుమార్లు యాప్ వినియోగించేలా చేస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు

Read Latest and Viral News

Updated Date - Dec 24 , 2024 | 01:57 PM