Britain: క్రిమినాలజీ విద్యార్థి దారుణం! హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని..
ABN , Publish Date - Dec 11 , 2024 | 10:34 PM
బ్రిటన్‌లో క్రిమినాలజీ అభ్యసిస్తున్న ఓ విద్యార్థి కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ మహిళను కత్తితో పొడిచి అంతమొందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో క్రిమినాలజీ అభ్యసిస్తున్న ఓ విద్యార్థి కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టాడు. హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ మహిళను కత్తితో పొడిచి అంతమొందించాడు. నిందితుడిని 20 ఏళ్ల నాసెన్ సాడీగా గుర్తించారు. అతడి దాడిలో ఏమీ గ్రే (34) అనే మహిళ మృతి చెందగా ఆమె స్నేహితురాలు లియాన్ మైల్స్ (38) తీవ్ర గాయాల పాలయ్యారు (Viral).
ఈ హత్య అత్యంత దారుణమైనదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ‘ఓ వ్యక్తి ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావించాడు. మహిళలను భయభ్రాంతులను చేయాలనుకున్నాడు. అపరిచిత మహిళలపై అత్యంత పాశవికంగా దాడికి దిగాడు’’ అని తెలిపారు.
Viral: పాము, ముంగిస మధ్య జాతి వైరం ఎందుకో తెలుసా?
మీడియా కథనాల ప్రకారం, ఘటన జరిగిన రాత్రి గ్రే, మైల్స్ ఇద్దరూ డర్లీ చీన్ బీచ్‌లో చలి మంట వేసుకుని కూర్చుని చంద్రుడిని చూస్తూ సేద తీరసాగారు. అక్కడికి సమీపంలోని ఓ హోటల్‌లో నిందితుడు దిగాడు. హత్యకు ఒడిగట్టడానికి మునుపు అతడు భయానక క్రైమ్ సన్నివేశాలు ఉన్న ఓ టీవీ షోను కూడా చూశాడు. ఇక బాధిత మహిళలు తమ మానాన తాము ఉన్న తరుణంలో చప్పుడు చేయకుండా వచ్చిన నిందితుడు వారిపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. గ్రేను చేజిక్కించుకుని అంతమొందించాడు. మైల్స్‌పై కూడా అతడు దాడికి దిగినా కూడా ఆమె ఎలాగొలా అతడిని నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలో తీవ్ర గాయాల పాలైంది. తనను ప్రాణాలతో విడిచిపెట్టాలని ఎంత వేడుకున్నా సాడీ కనికరించకుండా దాడికి దిగాడని మైల్స్ ఆ తరువాత తెలిపింది.
Viral: ఎయిర్‌పోర్టులోనూ ఇదే దుస్థితా! రూ.200 పెట్టి పకోడీలు కొంటే..
కాగా, క్లాసులో ఉన్నప్పుడు సాడీ ఓసారి హత్య చేస్తే వచ్చే పర్యవసానాలు, స్వీయ రక్షణకు సంబంధించిన ప్రశ్నలు అడిగాడని అతడి అధ్యాపకురాలు పేర్కొంది. ఈ అంశాలు సిలబస్‌లో భాగం కాదని పేర్కొంది. ఈ ప్రశ్న ఎందుకు అడిగావని తాను అతడిని ప్రశ్నిస్తే తానో ఆర్టికల్ రాస్తున్నట్టు సాడీ సమాధానమిచ్చినట్టు పేర్కొంది. తనకు కత్తులు అంటే ఇష్టమని సాడీ చెప్పినట్టు జైలు అధికారి ఒకరు మీడియాతో పేర్కొన్నారు. కత్తులు, వాటి ఆకృతి తనకు ఇష్టమని సాడీ చెప్పినట్టు వెల్లడించారు.
Elon Musk: నేను అప్పుడే చెప్పా.. కానీ నాకు మతి లేదని అన్నారు: ఎలాన్ మస్క్