Viral: తల్లి ఆనందం కోసం పోలీసు అవతారమెత్తిన నిరుద్యోగ యువతి! చివరకు..
ABN, Publish Date - Nov 24 , 2024 | 08:23 PM
తల్లి కళ్లల్లో ఆనందం కోసం నకిలీ పోలీసు అవతారం ఎత్తిన ఓ యువతిపై తాజాగా కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: తల్లి కళ్లల్లో ఆనందం కోసం నకిలీ పోలీసు అవతారం ఎత్తిన ఓ యువతిపై తాజాగా కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది (viral).
Viral: ఆఫీసులో కునుకు తీసినందుకు ఊస్టింగ్.. బాధితుడికి రూ.41.6 లక్షల పరిహారం!
స్థానిక మీడియా కథనాల ప్రకారం, యువతి ధరించిన పోలీసు యూనిఫాంను పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో ఆమె బండారం బయటపడింది. నిందితురాలిని 28 ఏళ్ల శివానీ చౌహాన్‌గా గుర్తించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శివానీ న్యూమార్కెట్ ఏరియాలో ఏసీపీ స్థాయి అధికారి యూనిఫాంలో సంచరిస్తూ ఓ మహిళా కానిస్టేబుల్‌కు కనిపించిందట. ఆమెను చూడగానే తొలుత కానిస్టేబుల్ సెల్యూట్ కూడా చేశారు. ఈ క్రమంలో నేం ప్లేట్‌పై ఉన్న సంఖ్యలు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసులకు సంబంధించినవిగా కనిపించడంతో ఆమెకు అనుమానం కలిగింది. అశోక చిహ్నం ఉన్న యూనిఫాంను యువతి ధరించింది. దీంతో, సదరు కానిస్టేబుల్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో యువతి తొలుత బుకాయించింది. చివరకు అసలు తాను పోలీసే కాదన్న విషయం ఒప్పుకుంది.
Viral: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు! స్విగ్గీలో కండోమ్స్‌కు ఆర్డర్ పెడితే..
తనకు ఉద్యోగం లేదని, తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని యువతి తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. తల్లిని సంతోష పెట్టేందుకు తనకు పోలీసు ఉద్యోగం వచ్చినట్టు అసత్యం చెప్పానని నిందితురాలు తెలిపింది. దీంతో, ఆమెపై భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 205 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే, యూనిఫాంలో ఉండగా యువతి ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయలేదని దర్యాప్తులో తేలినట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
Viral: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై భార్య వింత రివెంజ్.. షాకింగ్ వీడియో!
Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..
Updated Date - Nov 24 , 2024 | 08:36 PM