ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అప్పుడలా.. ఇప్పుడిలా.. ఈమెకేమైంది

ABN, Publish Date - Sep 19 , 2024 | 05:23 PM

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉండిందట.. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. రక్త సంబంధిత సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఓ బాధితురాలికి వేసిన వ్యాక్సిన్ వికటించింది. దీంతో బాధితురాలి ముఖం గుర్తు పట్టరానంతగా మారిపోయింది.

ఇంటర్నెట్ డెస్క్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉండిందట.. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. రక్త సంబంధిత సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఓ బాధితురాలికి వేసిన వ్యాక్సిన్ వికటించింది. దీంతో బాధితురాలి ముఖం గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. తన ఆవేదనను బాధితురాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అలెక్సిస్ లోరెంజ్ అనే 23 ఏళ్ల యువతి పరోక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా(PNH) అనే వ్యాధితో బాధపడుతూ గత కొంత కాలంగా ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియా రాష్ట్రం ఆరెంజ్ లోని యూసీఐ మెడికల్ సెంటర్లో చికిత్స నిమిత్తం చేరింది. ఆమెకు వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు.

అనంతరం వ్యాధి తగ్గాలంటే రక్త మార్పిడి చేయించుకోవాలని సూచించారు. అందుకు అలెక్సిస్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. రక్తమార్పిడి తరువాత ఆమెకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ.. వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గలేదు. వ్యాధి నివారణకు వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యులు సూచించారు. అందుకు అంగీకరించిన అలెక్సిస్.. వ్యాక్సిన్లు వేయించుకుంది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి విషమించింది.


తాత్కాలికంగా చూపు కోల్పోయింది. దవడ భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడింది. వాంతులు, విరేచనాలకు తోడు అందవిహీనంగా మారింది. ఆమె పాత ఫొటో ఇప్పటి ఫొటో చూస్తేనే అర్థమవుతుంది వ్యాక్సిన్ ఎంతలా ప్రభావం చూపిందోనని. ఆమె నుదుటి పై భాగం ఉబ్బిపోయింది. ఆ ప్రాంతంలో నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. శరీరంలో చాలా భాగాలు ఇలాగే మారాయి.

వ్యాక్సిన్ సేఫ్టీ రీసెర్చ్ ఫౌండేషన్ (VSRF) నివేదికల ప్రకారం.. లోరెంజ్‪కు UCI మెడికల్ సెంటర్‌లో టెటానస్, న్యుమోకాకల్, మెనింజైటిస్ వ్యాక్సిన్‌లు వేశారు. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి వేగంగా క్షీణించసాగింది. దురదృష్టవశాత్తు ఆమెకు ఆరోగ్య బీమ కూడా లేదు. ప్రస్తుతం ఆమె ప్రత్యేక సంరక్షణ కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి చికిత్స కోసం నిధులు సేకరిస్తున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ చెప్పింది.


సోషల్ మీడియాలో..

వైద్యుల నిర్లక్ష్యానికి తాను ఎలా మారానో చెప్పాలని బాధితురాలు అనుకుంది. ఇందుకోసం ఆమె టిక్ టాక్ లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. సదరు వీడియోల్లో ఆమె పడుతున్న బాధ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. వ్యాక్సిన్ వికటించడంతో తన పరిస్థితి ఇలా అయిందని అలెక్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల వల్లే తన బిడ్డ ఇలా తయారైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను సాధారణ స్థితికి తీసుకువచ్చి, ప్రాణాపాయం నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

ForLatest NewsandNational Newsclick here

Updated Date - Sep 19 , 2024 | 05:34 PM

Advertising
Advertising