ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

4B Movement: అమెరికాలో మరో ఉద్యమం! పురుషులతో శృంగారానికి నో అంటున్న మహిళలు

ABN, Publish Date - Nov 09 , 2024 | 05:10 PM

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయానికి పురుష సమాజాన్ని నిందిస్తున్న మహిళలు వారిని అన్ని రకాలుగా దూరం పెట్టేస్తున్నారు. 4బీ ఉద్యమం పేరిట మగాళ్లపై ప్రతీకారానికి సిద్ధమవుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం అక్కడి మహిళలకు ఆగ్రహం తెప్పించిందా? దీనికి అమెరికా పురుషులను బాధ్యులను చేస్తూ ప్రతీకారానికి రెడీ అయ్యారా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. పురుషాధిక్యంపై ‘మీటూ’ అంటూ ఉద్యమించిన అమెరికా మహిళలు ఇప్పుడు 4బీ ఉద్యమం వైపు మళ్లుతున్నారట. తమ హక్కులను కాలరాస్తున్న ట్రంప్‌ను గద్దెనెక్కించినందుకు పురుష సమాజాన్ని నిందిస్తున్నారట. ఇకపై పురుషులకు దూరంగా ఉంటామని వారితో పెళ్లి, పిల్లలు, శృంగారం వంటి బంధాలేవీ పెట్టుకోమంటూ ఉద్యమిస్తున్నారట (USA).

Viral: భర్తకు జాబ్ పోయిందని విడాకులిచ్చి.. 4 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..


ఏమిటీ 4బీ ఉద్యమం?

ఈ ఉద్యమం దక్షిణ కొరియాలో మొదలైంది. బీ అంటే కొరియన్ భాషలో నో అని అర్థం. తమ హక్కులను కాలరాస్తున్న పురుషులతో విసిగిపోయిన అక్కడి మహిళలు ‘మీటూ’ తరువాత 4బీ ఉద్యమాన్ని లేవదీశారట. ఇందులో భాగంగా కొందరు మహిళలు పురుషులతో సెక్స్, రిలేషన్‌షిప్స్, పెళ్లి, పిల్లల్ని కనడం వంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశారట. ఒక్క ముక్కలో చెప్పాలంటే పురుషులను అన్ని రకాలుగా దూరం పెట్టేస్తున్నారట. ఈ ఉద్యమ ప్రభావం ఆరోగ్యకర స్త్రీపురుష బంధాలపై పడుతోందని ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడే వాపోయారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ కొరియాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటుకు ఈ ఉద్యమం కూడా కారణమని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు.

Viral: ఇదేం ప్రేమ రా బాబూ! తన పర్సు చోరీ చేసిన దొంగతో యువతి లవ్ ట్రాక్


ఇక ఇటీవలి అమెరికా ఎన్నికలు..అక్కడి స్త్రీలు, పురుషుల మధ్య యుద్ధంగా మారిందని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అబార్షన్‌లతో పాటు ఇతర హక్కుల విషయంలో ట్రంప్ వైఖరి అనేక మంది మహిళల్లో ఆందోళన కలగ జేసింది. దీంతో, ట్రంప్ గద్దెనెక్కితే తమ హక్కులను కాలరాస్తారని అక్కడి మహిళలు టెన్షన్ పడ్డారు. కమలా హ్యారిస్‌ విజయం సాధించాలని గట్టిగా కోరుకున్నారు. కానీ చివరకు ట్రంప్ అధికార పీఠం చేజిక్కించుకోవడంతో మహిళల కోపం పురుషులవైపు మళ్లింది. ట్రంప్ అధ్యక్షుడు కావడానికి పురుషులు పెద్ద సంఖ్యలో ఆయనకు ఓట్లు వేయడమే కారణమని భావించిన కొందరు చివరకు 4బీ ఉద్యమం బాటపడుతున్నారట. తమ హక్కులకు అండగా ఉండని పురుషులతో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని ప్రతినబూనారట.

అయితే, దీన్ని వ్యతిరేకించే మహిళలు కూడా సోషల్ మీడియాలో తమ గొంతు వినిపిస్తున్నారు. ఇది ఉద్యమం కాదని సోషల్ మీడియా ట్రెండ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాల ప్రభావం అమెరికా సమాజంపై ఎంత ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Read Latest and Viral News

Updated Date - Nov 09 , 2024 | 05:18 PM