ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వరుడి లోపాన్ని తెలివిగా బయటపెట్టిన వధువు.. దండలు మార్చుకుంటుండగా.. ఆమె చేసిన పనికి.. చివరకు..

ABN, Publish Date - Apr 26 , 2024 | 04:45 PM

వధూవరుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు వధూవరుల్లో ఎవరో ఒకరు ఉన్నట్టుండి ఎవరూ ఊహించిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. వివాహ సమయాల్లో...

ప్రతీకాత్మక చిత్రం

వధూవరుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు వధూవరుల్లో ఎవరో ఒకరు ఉన్నట్టుండి ఎవరూ ఊహించిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. వివాహ సమయాల్లో చోటు చేసుకునే విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లిలో దండలు మార్చుకునే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరుడి లోపాన్ని తెలివిగా బయటపెట్టిన వధువు.. చివరకు ఏం చేసిందంటే..


రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వార్త (Viral news) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మహోబా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రంతానికి చెందిన ఓ వ్యక్తికి.. ఇదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహ నిశ్చయమైంది. దీంతో వరుడు తన బంధుమిత్రులందరితో కలిసి ఊరేగింపుగా వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఊరేగింపు అనంతరం రాత్రి వరమాల కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న అనూహ్య ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వధూవరులు (bride and groom) ఇద్దరూ దండలు మార్చుకుంటుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయ్.. అవేంటో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..


వధువు మెడలో వరుడు దండ వేయబోతుండగా.. వధువు సడన్‌గా అడ్డుకుంది. ‘‘ముందు నేను చెప్పిన పని చెయ్.. తర్వాత దండ మెడలో వేయ్’’.. అంటూ ఓ కండీషన్ పెట్టింది. చివరకు గణితానికి సంబంధించిన ఓ పట్టికను తీసుకొచ్చి వరుడికి ఇచ్చింది. ఆ పట్టికను చదవాలని షరతు విధించింది. అయితే వరుడు నిరక్షరాస్యుడు (illiterate groom) కావడంతో దాన్ని చదవడం అతడి వల్ల కాలేదు. దీంతో చివరకు వధువు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ‘‘చదువు రాని ఇలాంటి వ్యక్తిని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను’’.. అంటూ తెగేసి చెప్పింది. ఇంత చిన్న కారణానికి పెళ్లి క్యాన్సిల్ చేయడం తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.

Viral Video: కారును ఇలాక్కూడా క్లీన్ చేయొచ్చా.. ఈ డ్రైవర్ కక్కుర్తి మామూలుగా లేదుగా..


వధువుకు నచ్చజెప్పాలని అంతా వివిధ రకాలుగా ప్రయత్నించారు. అయినా వధువు వినిపించుకోలేదు. చివరకు పోలీసులు కలుగజేసుకుని ఆమెకు నచ్చజెప్పాలని చూసినా వధువు మాత్రం అదే మాటే ఉంది. దీంతో చివరకు చేసేదేమీ లేక వరుడు కుటుంబం.. తీసుకున్న కట్నం వెనక్కు ఇచ్చి, అక్కడి నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ వధువేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘చదువు రాదనే విషయం ముందు తెలియదా.. తీరా వివాహ సమయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఎండ వేడి భరించలేక.. లారీ నడుపుతూనే ఈ డ్రైవర్ చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Apr 26 , 2024 | 04:45 PM

Advertising
Advertising