Viral News: హెలికాప్టర్ కారుకు పోలీసుల చలాన్.. నెటిజన్ల ఆగ్రహం
ABN, Publish Date - Mar 20 , 2024 | 03:08 PM
ఇటివల ఓ వ్యక్తి తన కారు(car)ను సరికొత్తగా హెలికాప్టర్(Helicopter) మాదిరిగా తయారు చేయించుకున్నాడు. అంతేకాదు అందుకోసం అతను ఏకంగా 2.5 లక్షలు ఖర్చు చేశాడు. కానీ అది కాస్తా పోలీసుల కంట పడటంతో రెండు వేల రూపాయల చలాన్ వేశారు.
ఇటివల ఓ వ్యక్తి తన కారు(car)ను సరికొత్తగా హెలికాప్టర్(Helicopter) మాదిరిగా తయారు చేయించుకున్నాడు. అంతేకాదు అందుకోసం అతను ఏకంగా 2.5 లక్షలు ఖర్చు చేశాడు. కానీ అది కాస్తా పోలీసుల(police) కంట పడటంతో రెండు వేల రూపాయల చలాన్ వేశారు. ఈ సంఘటన ఇటివల ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని అంబేద్కర్ నగర్(Ambedkar Nagar)లో చోటుచేసుకుంది. ఈశ్వర్ దీన్ వ్యక్తి తన వ్యాగనార్ కారును హెలికాప్టర్ ఆకారంలో తయారుచేయించుకున్నారు. కారు వెనుకభాగాన్ని మొత్తం పూర్తిగా మార్చేశారు. ఆ తర్వాత దానిని పెయింటింగ్ కోసం తీసుకెళ్తున్న క్రమంలో దారిలో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలాన్ వేశారు.
అయితే బీహార్, యూపీ(Uttar Pradesh)లోని ప్రతాప్‌గఢ్‌లలో ఇలాంటి కార్లు ఉన్నాయని ఈశ్వర్ దీన్ తెలిపారు. పెళ్లిళ్ల కోసమే తాను సరికొత్తగా ఈ కారును మార్పు చేసుకున్నట్లు చెప్పారు. దానిని అద్దెకు ఇవ్వడం కోసమే ప్రత్యేకంగా మోడిఫై చేయించుకున్నట్లు బాధితుడు వెల్లడించారు. మోటారు వాహన చట్టం ప్రకారం ఈ కారుకు చలాన్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
కారు వెనుక భాగాన్ని తొలగించి, యథాతథ స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఉపయోగించుకోవాలని పోలీసులు(police) అన్నారు. కానీ హెలికాప్టర్‌గా మార్చడానికి తాను ఖర్చు చేసిన డబ్బు వృథా అయిందని బాధితుడు వాపోయారు. మరోవైపు ఈ విషయం తెలిసిన పలువురు ఈ కారుకు పోలీసులు ఎలా చలాన్ వేస్తారని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చలాన్ వేయాలి, కానీ దీనికి ఎందుకు వేశారని అంటున్నారు. అంతేకాదు అనేక మంది బైక్స్(bikes) సహా పలు వాహనాలను మార్పు చేసుకుంటే కూడా ఫైన్ వేస్తారా అని అడుగుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: సిగ్గులేని మానవ జాతికి గుణపాఠం చెప్పిన పులి.. వీడియో తప్పక చూడండి..!
Updated Date - Mar 20 , 2024 | 03:48 PM