Trending News: వడాపావ్ నయా రికార్డ్.. అత్యుత్తమ శాండ్‌విచ్‌ల జాబితాలో టాప్ 20లో చోటు..
ABN, Publish Date - Mar 12 , 2024 | 06:06 PM
వడాపావ్.. మహారాష్ట్ర ఫేమస్ స్నాక్. కేవలం మరాఠా గడ్డమీదే కాదండోయ్.. అద్భుతమైన రుచితో సరిహద్దులు చెరిపేస్తూ దేశమంతా పేరు సంపాదించుకుంది. బట్టర్ లో వేయించిన రెండు బన్ ముక్కల మధ్య ఆలూతో చేసిన వడను పెట్టుకుని తింటే ఉంటుంది..
వడాపావ్.. మహారాష్ట్ర ఫేమస్ స్నాక్. కేవలం మరాఠా గడ్డమీదే కాదండోయ్.. అద్భుతమైన రుచితో సరిహద్దులు చెరిపేస్తూ దేశమంతా పేరు సంపాదించుకుంది. బట్టర్ లో వేయించిన రెండు బన్ ముక్కల మధ్య ఆలూతో చేసిన వడను పెట్టుకుని తింటే ఉంటుంది.. ఆ అనుభవాన్ని అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలో వడాపావ్ మరో రికార్డు సాధించింది. ప్రపంచ అత్యుత్తమ శాండ్‌విచ్ ( Sandwich )ల జాబితాలో టాప్ 20లో చోటు సంపాందించుకుంది. ప్రస్తుతం 16వ స్థానాన్ని నిలబెట్టుకుని ఫుడ్ లవర్స్ తల ఎత్తుకునేలా చేసింది. వియత్నాంకు చెందిన బాన్ మై, టర్కీ టాంబిక్ డోనర్, లెబనాన్ షావర్మా, మెక్సికో టోర్టాస్, యూఎస్ క్రాబ్స్ టాప్ 5లో నిలిచాయి. జర్మనీకి చెందిన మెట్‌బ్రోచెన్ , స్పెయిన్ బోకాడిల్లో డి సెర్డో లు చివరి స్థానంలో సర్దుకున్నాయి.
పూర్తి వివరాలతో కూడిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు11,000 కంటే ఎక్కువ లైక్‌లు, వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సంఖ్య పెరుగుతోంది. అంతే కాకుండా నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తు్న్నారు. భారతదేశంలో ఉండటం, ప్రతిరోజూ వడ పావ్ తినడం గొప్పగా భావిస్తున్నానని ఒకరు, వడ పావ్ రుచి మాత్రమే కాదని ఇదొక ఎమోషన్ అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.
1960-1970ల మధ్య ముంబయిలోని దాదర్ రైల్వేస్టేషన్ సమీపంలో వ్యాపారి అశోక్ వైద్య ఈ ప్రసిద్ధ వడా పావ్ సృష్టికర్త అని చెబుతుంటారు. ఆకలితో బాధపడుతున్న వారికి తన వంతు సహాయం అందించేందుకు తక్కువ ధరలో పూర్తయ్యే ఈ వంటకాన్ని చేసినట్లు తెలుస్తోంది. అంతే.. ఒక్కసారిగా ఈ స్నాక్ ఐటమ్ రుచి అందరికీ నచ్చడంతో కొద్ది రోజుల్లోనే వడాపావ్ ఫేమస్ గా మారింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రుచుల ఘుమఘుమలను గుబాళిస్తోంది.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 12 , 2024 | 06:06 PM