Viral: ఇలాంటి అన్నాన్ని ఎవరైనా తింటారా? రోత పుడుతోంది.. కొత్త అన్నం రెసీపీకి షేకైపోతున్న నెటిజన్లు!
ABN, Publish Date - Apr 19 , 2024 | 03:10 PM
నీలి అన్నం వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ అన్నాన్ని నోట్లో పెట్టలేమంటూ అనేక మంది వీడియో చూసి గగ్గోలు పెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట్లో తరచూ ఏదోక కొత్త రెసీపీ వైరల్ అవుతూనే ఉంటుంది. తాము ఓ కొత్త ఫుడ్ ఐటెమ్ సిద్ధం చేశామంటూ జనాలు ఊదరకొడుతుంటారు. కొన్నింటిని మెచ్చుకునే నెటిజన్లు మిగతా వాటిని పెద్దగా ఖాతరు చేయరు. అయితే, రోత పుట్టేలా ఉండేవి కనిపిస్తే మాత్రం తెగ విమర్శలు చేస్తూ ఆ వంటకాన్ని వైరల్ (Viral) చేస్తారు. దాదాపు అలాంటి రెసీపీ గురించే ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపేరు నీలి అన్నం (Blue Rice) అట. ముదురు నీలి రంగులో ఉన్న ఈ ఉంటకాన్ని చూసి జనాలు షాకైపోతున్నారు.
Viral: దేశం ఎప్పటికీ ఇంతే.. వీళ్లింక మారరు! ఇదిగో ప్రూఫ్!
thecookingamma అనే ఇన్‌స్టాలో అకౌంట్లో తొలిసారిగా ఈ వీడియో కాలు పెట్టింది. ఆ నీలి అన్నాన్ని ఎలా చేయాలో వీడియోలో వివరంగా చెప్పారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ముందుగా బియ్యాన్ని కాసేపు నీళ్లల్లో నానబెట్టాలి. ఆ తరువాత దాన్ని పొయ్యిమీద పెట్టి ఉడికించాలి. ఆ తరువాత అందులో శంకుపుష్పం రేకులను (Butterfly peaflower) వేసి అన్నం ఉడికించాలి. ఈ లోపు మరో గిన్నెలో కాస్తంత నెయ్యి వేసి పోపు పెట్టి, ఉడికిన అన్నాని దానికి జత చేసి బాగా కలిపితే నీలి అన్నం రెడీ అట (video of blue rice receipe is shaking the internet).
ఈ వింత రెసీపీ జనాలను షేక్ చేస్తుండటంతో ఇప్పటివరకూ 1.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీన్ని మేమప్పటికీ టచ్ చేయం అంటూ అనేక మంది కామెంట్ చేశారు. ఈ వంటకాన్ని చూస్తుంటే కడుపులో తిప్పుతోందని కొందరు.. చూడగానే ఆకలి చచ్చిపోయిందని మరికొందరు అన్నారు. ఇది వంటకం కాదు నేరం అని కొందరు విమర్శించారు. మలేషియాలో మేము ఈ వంటకాన్ని లొట్టలేసుకుంటూ తింటాం అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరి నెట్టింట ఇంతగా వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓమారు చూడండి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 19 , 2024 | 03:15 PM