ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Giraffe: వామ్మో.. జిరాఫ్ నీళ్లు తాగేందుకు ఇంత రిస్క్ చేయాలా? వీడియో వైరల్

ABN, Publish Date - Mar 29 , 2024 | 07:21 PM

జిరాఫ్ తన మెడ కిందకు వంచి నీళ్లు తాగుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత పొడవైన జంతువుల్లో జిరాఫ్ (Giraffe) ఒకటి. బలమైన కాళ్లు కలిగిన ఈ జంతువు తంతే సింహం కూడా ఒక్క దెబ్బకే ప్రాణాలు విడుస్తుంది. అంతబలమైన జంతువు అయినా, మిగతా జంతువులకు అందనంత పొడవైన మెడ ఉన్నా కూడా జిరాఫ్ నిత్యం అనేక ప్రమాదాలు ఎదుర్కొంటుంది. పొడవైన కాళ్ల కారణంగా జిరాఫ్ కింద కూర్చుని లేచేందుకు కొంత శ్రమపడాల్సి వస్తుంది. ఈ సమయంలో క్రూర జంతువుల పాలపడితే ఇక మరణమే. అందుకే జిరాఫ్‌లు చాలా అరుదుగా మాత్రమే కూర్చుంటాయి.

ఇక జిరాఫ్‌ మెడ ఎత్తులో ఉన్న కొమ్మలను అందుకునేందుకు వీలుగా ఉంటుందని కానీ కిందనున్న నీళ్లను తాగడం మాత్రం దానికి చాలా కష్టం. అందుకే నీళ్లు తాగాల్సి వచ్చిన ప్రతిసారీ అది దాని ముందు రెండు కాళ్లను బార్లగా చాచి మెడ కిందకు వంచుతుంది. చుట్టూ క్రూర జంతువుల ఏవీ లేవని నిర్ధారించుకున్నాకే నీళ్లు తాగేందుకు సాహసిస్తుంది (Giraffe Drinking water).

థియేటర్‌లో సినిమా చూస్తున్న మహిళ.. ముందు సీట్లోని వ్యక్తి చిమ్మ చీకట్లో చేస్తున్నదేంటో చూసి..


ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వీడియోలో కూడా జిరాఫ్ నీళ్లు తాగేందుకు నానా యాతనా పడింది. తొలుత రెండు కాళ్లు బార్లగా చాచి నీటికి దగ్గరగా తల వంచింది. ఇంతలో ఏదో అలికిడి కావడంతో మళ్ల వెంటనే తిన్నగా నిలబడి. చుట్టూ ఏదీ లేదనుకుని నిర్ధారించుకున్నాక మళ్లీ నీళ్లు తాగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

జిరాఫ్ కష్టం చూసి అనేక మంది చలించిపోయారు. మరో దశాబ్దంలో జిరాఫ్‌లు అంతరించే అవకాశం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. జిరాఫ్‌లు చాలా అందమైనవని కొందరు చెప్పుకొచ్చారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళి మొత్తం మీద ఉందని తెలిపారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా, నీరు తాగేందుకు జిరాఫ్ తన నోటిని బోరు పంప్‌లాగా వాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 07:29 PM

Advertising
Advertising