ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Police Chase: ఐ20 కారును ఛేజ్ చేసిన పోలీసులు.. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ ఉండదేమో! వైరల్ వీడియో!

ABN, Publish Date - Feb 26 , 2024 | 06:25 PM

పోలీసులు ఓ కారును ఛేజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పోలీసులు ఓ కారును ఛేజ్ (Police Chase) చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో కూడా బహుశా ఇలాంటి సీన్లు చూడదలేదేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీడియోలో నిందితుడు రివర్స్‌లో డ్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే అతడు తప్పించుకోకుండా పోలీసులు తమ కారులో వెంబడించారు.

Viral video: ఎలా అడ్డంగా బుక్కయ్యాడో మీరే చూడండి.. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఐపీఎస్ అధికారని తెలీక..

ఈ ఘటన ఉత్తర‌ప్రదేశ్‌లో (Uttarpradesh) ఘాజియాబాద్‌లో వెలుగు చూసింది. అక్కడి హైవేపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా (Reckless Driving) కారు నడుపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు జీపులో అక్కడి చేరుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ సీన్ మొత్తం తలకిందులైంది. నిందితుడేమో కారును వెనక్కు తోలుతూ ఆపోజిట్ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తుంటే పోలీసులకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అదే లేన్‌లో అతడిని ఛేజ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఎదురుగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరక్కుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు. నిందితుడి కారుకు దగ్గరగా తమ కారును పోనిస్తూ అతడు కారును సరిగా మలుపు తిప్పే అవకాశమే ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు.


ఈ ఛేజింగ్ దాదాపు 2 కిలోమీటర్ల దూరం సాగిందని స్థానిక మీడియా చెబుతోంది. మరోవైపు, వీడియో నెట్టింట కాలుపెట్టీపెట్టడంతోనే వైరల్ అయిపోయింది. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ ఉండదేమో అంటూ కొందరు కామెంట్ చేశారు. అయితే, ఇంతసేపు నిందితుడిని వెంబడించినా అతడు చివర్లో ఎలాగో పోలీసుల నుంచి తప్పించుకున్నాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పోలీసులు ఆ నిందితుడు ఎవరో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని జల్లెడపడుతున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2024 | 06:28 PM

Advertising
Advertising