మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: బాలికను రక్షించేందుకు కుక్క వెరైటీ ప్లాన్.. తుపాకీతో కాల్చగానే అది చేసిన నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Feb 28 , 2024 | 05:45 PM

ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమకు తిండి పెట్టిన యజమానుల శ్రేయస్సు కోసం అవి ఏం చేయడానికైనా సిద్ధపడతాయి. ప్రాణాలకు తెగించి మరీ.. పోరాడ్డానికి కూడా వెనుకాడవు. ఇలాంటి..

Viral Video: బాలికను రక్షించేందుకు కుక్క వెరైటీ ప్లాన్.. తుపాకీతో కాల్చగానే అది చేసిన నిర్వాకం చూస్తే..

ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమకు తిండి పెట్టిన యజమానుల శ్రేయస్సు కోసం అవి ఏం చేయడానికైనా సిద్ధపడతాయి. ప్రాణాలకు తెగించి మరీ.. పోరాడ్డానికి కూడా వెనుకాడవు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బాలికను రక్షించేందుకు ఓ కుక్క వెరైటీ ప్లాన్ చేసింది. తుపాకీతో కాల్చగానే అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంట్లో ఉన్న బాలికను కిడ్నాప్ చేసేందుకు (Kidnapping attempt) ఓ వ్యక్తి ప్రయత్నిస్తాడు. తుపాకీ పట్టుకుని మెల్లగా తలుపులు తీసి లోపలికి వస్తాడు. లోపలికి రాగానే ఓ వైపు కుక్క పడుకుని ఉండడం చూసి తుపాకీ తీసుకుని ఫైర్ చేస్తాడు. అయితే అతను ఇలా తుపాకీ చూపించగానే కుక్క వెంటనే చనిపోయినట్లు పడిపోతుంది. కుక్క చనిపోయిందని భావించిన అతను.. మెల్లగా బాలిక వద్దకు వెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: సైకిల్‌పై వెళ్తూనే వేడి వేడి టర్కిష్ కాఫీ తయారీ.. వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

అయితే బాలిక చేయి పట్టుకోగానే పడుకున్న కుక్క వెంటనే పైకి లేచి, పరుగు పరుగున బాలిక వద్దకు వచ్చి అతడి చేయిని పట్టుకుంటుంది. దీంతో ఒక్కసారిగా షాకైన అతను.. కుక్క నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ కుక్క మాత్రం అతన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఇలా తన యజమాని కూతురిని సదరు కుక్క రక్షిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కుక్క తెలివిని పరీక్షించడానికి కావాలనే ఇలా చేసినట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘కుక్కకు ట్రైనింగ్ బాగా ఇచ్చారు’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఈ కుక్క చాలా తెలివిగా ఉన్నట్టుందే’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 మిలియన్లకు పైగా వ్యూస్‪‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అమ్మాయిలే సిగ్గుపడి పారిపోయేలా.. మెట్రో రైల్లో ఈమె చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Feb 28 , 2024 | 05:45 PM

Advertising
Advertising