40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో! ఇదేందయ్యా.. రైల్వే ట్రాకుపై ఈ అమ్మాయిలు చేస్తున్న పనులు చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Jan 26 , 2024 | 04:14 PM

చాలామంది ప్రమాదమని తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు ..

Viral Video: వామ్మో! ఇదేందయ్యా.. రైల్వే ట్రాకుపై ఈ అమ్మాయిలు చేస్తున్న పనులు చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

చాలామంది ప్రమాదమని తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు విధి లేని పరిస్థితుల్లో సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అమ్మాయిలంతా కలిసి రైల్వే ట్రాకుల మధ్యలో చేస్తున్న పనులు చూసి అంతా షాక్ అవుతున్నారు.

ముంబైలోని (Mumbai) మాహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైలు పట్టాలపై ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువతుల, మహిళలు కలిసి.. రైల్వే పట్టాల మధ్యలోని ఖాళీ స్థలంలో వంట మొదలెట్టారు. కొందరు వంట చేస్తుంటే.. మరికొందరు యువతులు (Young women in middle of the railway tracks) పుస్తకాలు చదువుతున్నారు. వారిలో కొందరు దుప్పటి కప్పుకొని నిద్రపోతుండగా.. మరికొందరు చిన్న పిల్లలు ఏకంగా రైలు పట్టాలపై కూర్చుని ఆడుకుంటున్నారు. ఆ సమయంలో పొరపాటున రైలు వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినా వారిలో ఏమాత్రం భయం కనిపించలేదు.

AI Technology: మృతదేహం కళ్లు తెరిపించిన ఏఐ.. చివరకు నేరస్థులు ఎలా దొరికిపోయారంటే..

ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు.. అక్కడున్న వారిని చూసి అవాక్కయ్యారు. ఎంత ఇల్లు లేకపోతే మాత్రం.. ఇలా ప్రమాదకరంగా రైలు పట్టాల మధ్యన గడపడం ఏంటని, పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని కొందరు ప్రశ్నించారు. ఇంకొందరు వారిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఘటనలపై అధికారులు చర్యలు తీసుకోవాలి’’... అంటూ కొందరు, ‘‘ఖాళీ ప్రదేశాల్లోకి వెళ్లకుండా.. రైలు పట్టాల మధ్యలో గడపడం ఏంటీ’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అయోధ్యలో అంతా రామభక్తిలో ఉంటే.. ఈ పిల్లాడు చేసిన గొప్ప పని చూడండి..

Updated Date - Jan 26 , 2024 | 04:34 PM

Advertising
Advertising