Viral Video: అతిథులకు భోజనం పెట్టే విషయంలో భారతీయులకు ఎవరూ సాటి రారట.. వీడియో వైరల్!
ABN , Publish Date - May 11 , 2024 | 03:31 PM
అతిథి దేవోభవ అని భారతీయులు బలంగా నమ్ముతారు. ఇంటికి వచ్చిన వ్యక్తికి సకల మర్యాదలూ చేయాలని తపిస్తారు. ఇంటికి శత్రువు వచ్చినా సరే.. వాడి కడుపు నింపి పంపిస్తారు. అతిథులకు భారతీయులు ఎలా భోజనం పెడతారో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతిథి దేవోభవ అని భారతీయులు బలంగా నమ్ముతారు. ఇంటికి వచ్చిన వ్యక్తికి (Guests) సకల మర్యాదలూ చేయాలని తపిస్తారు. ఇంటికి శత్రువు వచ్చినా సరే.. వాడి కడుపు నింపి పంపిస్తారు. అతిథులకు భారతీయులు ఎలా భోజనం పెడతారో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (How Indians Serve Food). ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూ ఏకంగా 1.8 కోట్ల వ్యూస్‌కు పైగా దక్కించుకుంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోను అంకుర్ అగర్వాల్ అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ పోస్ట్ చేశారు (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో అతిథికి ఓ కుటుంబం సకల మర్యాదలూ చేస్తోంది. అతడికి సౌకర్యవంతంగా ఉన్న చోట కూర్చోబెట్టి భోజనం (Food) వడ్డిస్తారు. ఓ వ్యక్తి దగ్గర కూర్చుని అతిథికి అన్నం, కర్రీస్ వడ్డించాడు. తిన్న తర్వాత ఇంకొంచెం ఇంకొంచెం అంటూ అతిథికి వడ్డన చేశాడు. స్పెషల్‌గా స్వీట్లు తెప్పించానంటూ వాటిని ఇచ్చాడు. తిన్న తర్వాత అతిథి ప్లేట్ తీయబోతే వారించాడు. అరే అసలు మీరు ఏం తిన్నారు? సరిగ్గా తినలేదని అన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మందికి నచ్చడంతో లైక్, షేర్ కూడా చేస్తున్నారు. ఈ వీడియోకు 14.8 లక్షలకు పైగానే లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. ``మా ఇంట్లో కూడా అతిథులకు ఇలాగే వడ్డిస్తాం``, ``అతిథులను గౌరవించడం గొప్ప సంస్కారం``, ``యాక్టింగ్ అదిరిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెళ్లి వేడుకలో కాబోయే భార్యకు షాకిచ్చిన వరుడు.. ఆమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందంటే..
Friendship Marriage: ఏమిటీ ఫ్రెండ్షిప్ మ్యారేజ్? జపాన్‌లో యువతీయువకుల కొత్త డేటింగ్ గురించి తెలుసా?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..